నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నోముల భగత్‌.. పార్టీ బీఫామ్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ‌ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి ఎట్టకేలకు తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ‌

నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నోముల భగత్‌.. పార్టీ బీఫామ్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌
Nomula Bhagath Trs Candidate For Nagarjuna Sagar By Election
Follow us
Balaraju Goud

| Edited By: Sanjay Kasula

Updated on: Mar 29, 2021 | 4:20 PM

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ‌ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి ఎట్టకేలకు తమ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య కుమారుడు నోముల భగత్‌ పేరును ఆ పార్టీ ఎంపిక చేసింది. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ నోముల భగత్‌కు బీ-ఫాం అందజేశారు. భగత్‌ రేపు ఉదయం నిడమనూరులో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

గత కొద్దిరోజులు పెద్ద సవాల్‌గా మారిన అభ్యర్థి ఎంపికపై పార్టీ తీవ్రస్థాయిలో కసరత్తు చేసింది. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఇతర నేతలు కోటిరెడ్డి, గురవయ్యయాదవ్‌, రంజిత్‌యాదవ్‌, బాలరాజ్‌యాదవ్‌ తదితరులు కూడా టికెట్‌ ఆశించారు. వీరందరి పేర్లను సీఎం పరిశీలించి.. గెలుపోటములపై సర్వే చేయించారు. నల్గొండ జిల్లా పార్టీ నేతలతో పాటు ఇన్‌ఛార్జులు, ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నారు. పార్టీ శ్రేణుల మనోభావాలకు తోడు నోముల నర్సింహయ్య పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన వారసునికి అవకాశం ఇవ్వడం మేలని టీఆర్ఎస్ అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అధినేత.. భగత్‌కు టికెట్‌ను ఖరారు చేశారు.

సాగర్‌ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రతి అంశాన్నీ సీఎం కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌లో జరిగిన నష్టాన్ని పట్టభద్రుల ఎన్నికల్లో పూడ్చుకున్నామని.. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో భారీ మెజారిటీ సాధించాలని అధినేత కేసీఆర్ సూచించారు. కాగా.. ఏప్రిల్‌ 5 నుంచి 10 దాకా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో సీఎం కేసీఆర్‌ సభ, కేటీఆర్‌ రోడ్‌ షోలు ఉంటాయని తెలుస్తోంది. ఇదీ చదవండిః 

ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇక నామమాత్రం, ఎన్సీటీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

నందిగ్రామ్ లో దీదీ 8 కి.మీ. ‘వీల్ చైర్ యాత్ర’, ఎండలో తృణమూల్ కాంగ్రెస్, భద్రతా సిబ్బందిపాట్లు