నందిగ్రామ్ లో దీదీ 8 కి.మీ. ‘వీల్ చైర్ యాత్ర’, ఎండలో తృణమూల్ కాంగ్రెస్, భద్రతా సిబ్బందిపాట్లు

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం నందిగ్రామ్ లో సుదీర్ఘ 'వీల్ చైర్ యాత్ర' చేపట్టారు. సుమారు 8 కిలో మీటర్ల దూరం ఇది సాగింది. కానీ అక్కడ దీన్ని 'పాదయాత్ర' గా వ్యవహరిస్తున్నారు. పూర్బా  మేదినీ పూర్ జిల్లాలోని..

నందిగ్రామ్ లో దీదీ 8 కి.మీ. 'వీల్ చైర్ యాత్ర', ఎండలో తృణమూల్ కాంగ్రెస్, భద్రతా సిబ్బందిపాట్లు
Mamata Banerjee Holds Massive Padayatra In Nandigram
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 29, 2021 | 3:29 PM

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం నందిగ్రామ్ లో సుదీర్ఘ ‘వీల్ చైర్ యాత్ర’ చేపట్టారు. సుమారు 8 కిలో మీటర్ల దూరం ఇది సాగింది. కానీ అక్కడ దీన్ని ‘పాదయాత్ర’ గా వ్యవహరిస్తున్నారు. పూర్బా  మేదినీ పూర్ జిల్లాలోని నందిగ్రామ్ నియోజకవర్గానికి ఏప్రిల్ 1 న  (రెండో దశలో) ఎన్నిక జరగనుంది.  ఈ సందర్భంగా మమతా బెనర్జీ  సోమవారం ఈ యాత్రని రేపార ఖుదీరాం ప్రాంతం నుంచి  ఠాకూర్ చౌక్ వరకు వీల్ చైర్ లోనే కొనసాగించారు. మమతా బెనర్జీ జిందాబాద్ అంటూ వందల సంఖ్యలో స్థానికులు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. గురువారం నాడు తాను ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి సాయంత్రం ముగిసేవరకు  ఈ నందిగ్రామ్ నియోజకవర్గంలోనే ఉంటానని మమత ప్రకటించారు.కాగా-హోమ్ మంత్రి  అమిత్ షా మంగళవారం ఈ నియోజకవర్గాన్నీ సందర్శించి ఇక్కడ జరిగే రోడ్ షో లలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

అటు మమత.. తన బీజేపీ ప్రత్యర్థి ఈ నియోజకవర్గ అభ్యర్థి సువెందు అధికారిపై విరుచుకపడ్డారు. ఇక్కడ తాను (అధికారి) గెలిచి తీరుతానని ఆయన అంటున్నారని, కానీ ఈ నియోజకవర్గ ఓటర్లకు ఎవరికీ ఓటు వేయాలో తెలుసునని ఆమె అన్నారు. తనపై 50 వేల ఓట్ల తేడాతో విజయం సాధిస్తానని ఆయన సవాల్ చేశారని, కానీ నేను మాత్రం ఎలాంటి సవాల్ చేయబోనని ఆమె వ్యాఖ్యానించారు. గెలుపు ఓటములను  ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఇక బెంగాల్ లో ముఖ్యంగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ప్రచారం జోరందుకుంటోంది. అనేక చోట్ల త్రిముఖ పోటీ ఉన్నా ప్రధాన పోటీ మాత్రం ఈ రెండు పార్టీల మధ్యే ఉంది. అటు. పలు చోట్ల పోలీసులు సోదాలు చేసి నాటు బాంబులను, నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.  ముందు జాగ్రత్త చర్యగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ : Glass Bridge: హాట్ టాపిక్‌గా మారిన చైనా లో మరో అద్భుత కట్టడం…!! తప్పక చూడాల్సిందే… ( వీడియో )

Viral Video: పాముపై ఊరేగిన కప్ప…!! స్నేహితులుగా మారిన ఆగర్భ శత్రువులు… ( వీడియో ) Prison island: సముద్రాల మధ్యలో ఉండే అందమైన ద్వీపం… షాకింగ్ నిజాలు…!! ( వీడియో )

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ