Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు నగరంలోని ప్రజలకు అలర్ట్ జారీ చేసింది.. నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని.. ప్రజలు ముందే తాగు నీటి కోసం ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం..
Hyderabad Water Supply
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 14, 2025 | 4:14 PM

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు నగరంలోని ప్రజలకు అలర్ట్ జారీ చేసింది.. నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని.. ప్రజలు ముందే తాగు నీటి కోసం ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డు (HMWSSB) నగరంలోని అనేక ప్రాంతాలలో సోమవారం ఉదయం నుంచి 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నట్లు ప్రకటించింది. కొండపాక పంపింగ్ స్టేషన్‌లో కీలకమైన వాల్వ్‌లను మార్చడానికి వీలుగా ఫిబ్రవరి 17, 2025 ఉదయం 6 గంటల నుంచి నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు హైదరాబాద్ జలమండలి శుక్రవారం ప్రకటనలో తెలిపింది. కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద 3000 mm డయా MS పంపింగ్ మెయిన్‌పై హైదరాబాద్ జలమండలి 900 mm డయా BF, NRV వాల్వ్‌లను ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు తెలిపింది.

నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రాంతాలు ఇవే..

ఎస్‌ఆర్ నగర్, సనత్‌నగర్, బోరబండ, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగల్ రావ్ నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్, కూకట్‌పల్లి, భాగ్యనగర్, వివేకానందనగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్‌నగర్, మోతీనగర్, గాయత్రినగర్, బాబానగర్, కేపీహెచ్‌బీ, బాలాజీపేట, హస్మత్‌పేట్..

చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్‌నగర్, గాజులరామారం, సూరారం, ఆదర్శనగర్, భగత్‌సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, అల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్, వెంకటాపురం, మచ్చబొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్‌పైనగర్, యాప్రాల్, చాణిక్యపురి, గౌతంనగర్, సాయినాథపురం..

చర్లపల్లి, సాయిబాబానగర్‌, రాధిక, కొండాపూర్‌, డోయన్స్‌, మాదాపూర్‌లో కొంత భాగం, హఫీజ్‌పేట, మియాపూర్‌, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ, నాగారం, నిజాంపేట్‌, బాచుపల్లి, ప్రగతినగర్‌, గండిమైసమ్మ, తెల్లాపూర్‌, బోల్లారం, ఎంఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్‌రాక్, హాకిమ్‌పేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, AIIMS, బీబీనగర్.. ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.

ఈ సమయంలో తాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభావిత ప్రాంతాల నివాసితులకు హైదరాబాద్ జలమండలి సూచించింది.. ఫిబ్రవరి 18 మంగళవారం ఉదయం 6:00 గంటలకు సాధారణ తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..