Hyderabad: నగరవాసులకు అలెర్ట్.. ఆరోజు పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. పూర్తి వివరాలివే
తాగునీటి సరఫరాకు సంబంధించి నగర వాసులకు హైదరాబాద్ జల మండలి కీలక సూచనలు చేసింది. లీకేజీ పైప్‌లైన్ మరమ్మతుల పనుల కారణంగా ఫిబ్రవరి 8న నగరంలోని పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపింది.
తాగునీటి సరఫరాకు సంబంధించి నగర వాసులకు హైదరాబాద్ జల మండలి కీలక సూచనలు చేసింది. లీకేజీ పైప్‌లైన్ మరమ్మతుల పనుల కారణంగా ఫిబ్రవరి 8న నగరంలోని పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. జలమండలి పరిధి ఖానాపూర్ లైన్ కోకాపేట్ లోని మై హోమ్ అవతార్ వద్ద పీఎస్సీ పైపు లైన్ దెబ్బతినడంతో భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి 1200 ఎంఎం డయా ఎంఎస్ బ్యారెల్ ను అమర్చడానికి మరమ్మతులు పనులు చేపట్టనున్నారు. దీంతో బుధవారం( ఫిబ్రవరి 8) ఉదయం 6 గంటల నుంచి గురువారం (ఫిబ్రవరి9) ఉదయం 6 గంటల వరకు ఈ పనులు జరగనున్నాయి. ఈనేపథ్యంలో సుమారు 24 గంటల పాటు హైదరాబాద్ లోని మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలు, షేక్ పేట్ రిజర్వాయర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి ప్రకటించింది.
మంచి నీటి సరఫరా అంతరాయం కలిగే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎం డివిజన్ నం.3: షేక్ పేట్, టోలీచౌకి, గోల్కొండ, చింతల్ బస్తి, విజయానగర్, ఓల్డ్ మల్లెపల్లి. 2. ఓ అండ్ ఎం డివిజన్ నం.18: గండిపేట్, కోకాపేట్, నార్సింగి, పుప్పాల గూడ, మణికొండ, ఖానాపూర్, నెక్నంపూర్, మంచిరేవుల గ్రామాలు.
ఈ మేరకు నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..