Hyderabad Water Bill: అలాంటి మెసేజ్‌లతో జర భద్రం..! హైదరాబాద్ జలమండలి అలెర్ట్..
ఇలాంటి మోసాలకు బలైన వారు పెద్ద మొత్తంలో నగదు కోల్పోయే ప్రమాదం ఉంది. వారి వ్యక్తిగత డేటా, బ్యాంకింగ్ సమాచారం నేరగాళ్ల చేతుల్లోకి వెళితే అది దుర్వినియోగానికి గురవుతుంది. అందుకే అప్రమత్తంగా ఉండి, సరైన చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. జలమండలి వినియోగదారులు సైబర్ మోసాలకు గురికాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలు చేస్తున్నారు. ఈసారి వారు హైదరాబాద్ జలమండలి వినియోగదారులను టార్గెట్ చేస్తూ, నల్లా బిల్లుల చెల్లింపుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. “మీరు నల్లా బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్‌ను తొలగిస్తాము” అనే భయపెట్టే మెసేజ్ లు వినియోగదారులకు పంపుతున్నారు. ఈ సందేశాలను నమ్మినవారికి ఏపీకే ఫైళ్లను పంపిస్తూ వారి వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారు.
ఈ విషయంపై జలమండలి అధికారులు స్పందిస్తూ, ఈ సందేశాలు తమవి కాదని, పూర్తిగా నకిలీవి అని స్పష్టం చేశారు. ప్రజలు అలాంటి సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. వినియోగదారులు తమ బిల్లుల సమాచారం కోసం జలమండలి అధికారిక వెబ్‌సైట్‌ను లేదా కస్టమర్ కేర్ నెంబర్లను మాత్రమే వినియోగించాలని సూచించారు.
నేరగాళ్లు ప్రజలకు నల్లా బిల్లుల పేరిట సందేశాలను పంపుతారు. సందేశంలో ఉన్న లింక్‌ను నొక్కితే ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయమని సూచిస్తారు. ఒకసారి ఫైల్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తే, అది మీ ఫోన్‌లోని సమాచారాన్ని చోరీ చేస్తుంది. బ్యాంక్ ఖాతాల వివరాలు, యూపీఐ పిన్‌లు వంటి వ్యక్తిగత డేటా మోసగాళ్ల చేతుల్లో పడుతుంది.అందుకే అప్రమత్తగా ఉండండి. అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బిల్లుల చెల్లింపులు చేయండి. అనుమానాస్పద సందేశాలు లేదా లింక్‌లను క్లిక్ చేయకుండా ఉంటే మంచిది. ఫోన్‌లో అనుమానాస్పద ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దు. నకిలీ సందేశాలు వచ్చినప్పుడు వాటిని జలమండలి కస్టమర్ కేర్‌కు తెలియజేయండి.
ఇలాంటి మోసాలకు బలైన వారు పెద్ద మొత్తంలో నగదు కోల్పోయే ప్రమాదం ఉంది. వారి వ్యక్తిగత డేటా, బ్యాంకింగ్ సమాచారం నేరగాళ్ల చేతుల్లోకి వెళితే అది దుర్వినియోగానికి గురవుతుంది. అందుకే అప్రమత్తంగా ఉండి, సరైన చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. జలమండలి వినియోగదారులు సైబర్ మోసాలకు గురికాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.