17వ ఏడాదిలోకి.. వీణా-వాణీలు..!!

అవిభక్త కవలలు.. వీణా-వాణీలు.. నేటికి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని.. 17వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా వారి 17వ పుట్టినరోజు వేడుకను జరుపుకోనున్నారు. హైదరాబాద్‌లోని స్టేట్ హోంలో వారి జన్మదిన వేడుకలు జరుగనున్నాయి. మహబూబాబాద్ జిల్లా.. దంతాలవారి మండలం వీరిశెట్టి గ్రామానికి చెందిన మురళి, నాగలక్ష్మీ దంపతులకు 2002లో వీరు జన్మించారు. చాలా కాలం పాటు నీలోఫర్ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్న వీరు.. 2017 నుంచి స్టేట్ హోంలో ఉంటున్నారు. ఏటా స్టేట్‌హోంలో జరిగే పుట్టిన […]

17వ ఏడాదిలోకి.. వీణా-వాణీలు..!!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Oct 16, 2019 | 4:46 PM

అవిభక్త కవలలు.. వీణా-వాణీలు.. నేటికి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని.. 17వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా వారి 17వ పుట్టినరోజు వేడుకను జరుపుకోనున్నారు. హైదరాబాద్‌లోని స్టేట్ హోంలో వారి జన్మదిన వేడుకలు జరుగనున్నాయి. మహబూబాబాద్ జిల్లా.. దంతాలవారి మండలం వీరిశెట్టి గ్రామానికి చెందిన మురళి, నాగలక్ష్మీ దంపతులకు 2002లో వీరు జన్మించారు. చాలా కాలం పాటు నీలోఫర్ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్న వీరు.. 2017 నుంచి స్టేట్ హోంలో ఉంటున్నారు. ఏటా స్టేట్‌హోంలో జరిగే పుట్టిన రోజు వేడుకల్లో తల్లిదండ్రులు వెళ్లి పాల్గొంటారు. ఇవాళ వీణా-వాణీలు తమ 17వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు.