Breaking: పౌరసత్వం నిరూపించుకోండి.. హైదరాబాద్‌లో 127మందికి నోటీసులు..!
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతోన్న సమయంలో హైదరాబాద్‌లో ఆధార్ కలకలం రేపుతోంది. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని నగరంలో 127మందికి నోటీసులు అందాయి. అన్ని ఒరిజనల్ పత్రాలతో ఈ నెల 20లోగా విచారణకు హాజరు కావాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. సరైన పత్రాలు సమర్పించకపోతే ఆధార్ రద్దు చేస్తామని సంబంధిత అధికారులు హెచ్చరించారు. నకిలీ పత్రాలతో ఆటో డ్రైవర్ సత్తార్ అనే వ్యక్తి ఆధార్ తీసుకున్నాడని ఇటీవల ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3న సత్తార్‌కు […]
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతోన్న సమయంలో హైదరాబాద్‌లో ఆధార్ కలకలం రేపుతోంది. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని నగరంలో 127మందికి నోటీసులు అందాయి. అన్ని ఒరిజనల్ పత్రాలతో ఈ నెల 20లోగా విచారణకు హాజరు కావాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. సరైన పత్రాలు సమర్పించకపోతే ఆధార్ రద్దు చేస్తామని సంబంధిత అధికారులు హెచ్చరించారు. నకిలీ పత్రాలతో ఆటో డ్రైవర్ సత్తార్ అనే వ్యక్తి ఆధార్ తీసుకున్నాడని ఇటీవల ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3న సత్తార్‌కు నోటీసులు జారీ అయ్యాయి. అతడితో పాటు 127మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరు విచారణకు రాకుంటే సుమోటోగా తాము నిర్ణయం తీసుకుంటామని ఆధార్ అధికారులు హెచ్చరించారు. అలాగే, రూల్ 29 ప్రకారం ఆధార్ కార్డును కూడా రద్దు చేస్తామని వెల్లడించారు.
అయితే ఆధార్ వెరిఫికేషన్‌లో భాగంగా ఇలా నోటీసులు ఇవ్వడం సాధారణమేనని అధికారులు చెప్తున్నారు. ఇందులో ఎలాంటి ఉద్దేశ్యం లేదని.. పౌరసత్వ సవరణ చట్టానికి, దీనికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. UIDAIకు పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదంటూ విమర్శలు వస్తోన్న నేపథ్యంలో వివరణ ఇచ్చిన అధికారులు.. తప్పుడు పత్రాలతో కొందరు ఆధార్ కార్డులు పొందారంటూ తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే వీరికి నోటీసులు ఇచ్చామని అన్నారు. ఆధార్ చట్టం ప్రకారం అక్రమ వలసదారులకు ఈ కార్డు పొందే హక్కు లేదని తెలిపారు.