ఆర్టీసీ కార్మికుల అరెస్ట్.. ట్యాంక్‌బండ్‌ దగ్గర హైటెన్షన్

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు, విపక్షాలు పిలుపునిచ్చిన సకల జనుల సామూహిక దీక్ష ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ వద్ద బైఠాయించిన వందలాది ఆర్టీసీ కార్మికులు ఒక్కసారిగా బారికేట్లు, కంచెలను దూకి ట్యాంక్‌బండ్ మీదకు దూసుకెళ్లారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగ్గా.. 300 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సమీప స్టేషన్‌లకు తరలించారు. మరోవైపు సీపీఎం పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, […]

ఆర్టీసీ కార్మికుల అరెస్ట్.. ట్యాంక్‌బండ్‌ దగ్గర హైటెన్షన్
Follow us

| Edited By:

Updated on: Nov 09, 2019 | 2:32 PM

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు, విపక్షాలు పిలుపునిచ్చిన సకల జనుల సామూహిక దీక్ష ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ వద్ద బైఠాయించిన వందలాది ఆర్టీసీ కార్మికులు ఒక్కసారిగా బారికేట్లు, కంచెలను దూకి ట్యాంక్‌బండ్ మీదకు దూసుకెళ్లారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగ్గా.. 300 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సమీప స్టేషన్‌లకు తరలించారు. మరోవైపు సీపీఎం పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి, విమలక్క తదితరులు ర్యాలీగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మీదుగా వెళ్లగా.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో.. వారంతా ఇందిరాపార్క్‌ వైపు వెళ్లారు.