TSRTC: హైదరాబాద్ వాసులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. కొత్త మార్గాల్లో సర్వీసులకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్(Hyderabad) నగరవాసులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే వివిధ పద్ధతులు, రాయితీలు, ఆఫర్లతో ప్రజాభిమానాన్ని చూరగొంటున్న ఆర్టీసీ(TSRTC) మరో ముందడుగు వేసింది. నగరంలోని అన్ని ప్రాంతాలకు....

TSRTC: హైదరాబాద్ వాసులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. కొత్త మార్గాల్లో సర్వీసులకు గ్రీన్ సిగ్నల్
Tsrtc
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 03, 2022 | 7:13 AM

హైదరాబాద్(Hyderabad) నగరవాసులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే వివిధ పద్ధతులు, రాయితీలు, ఆఫర్లతో ప్రజాభిమానాన్ని చూరగొంటున్న ఆర్టీసీ(TSRTC) మరో ముందడుగు వేసింది. నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడిపించాలన్న ఉద్దేశ్యంతో కొత్త రూట్లను గుర్తించింది. ఫలితంగా ఆయా మార్గాల్లో బస్సులు ప్రయాణీకులకు సేవలు అందించనున్నాయి. హైదరాబాద్ శివారులో నిర్మించిన ఔటర్‌ రింగు రోడ్డు కారణంగా నగరం వేగంగా విస్తృతి చెందుతోంది. ఈ క్రమంలోనే వారందరికీ ప్రయాణ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో బస్సులు నడపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొత్త బస్సులు వచ్చాకే ఇవి కార్యరూపం దాలుస్తాయని అంటున్నారు. ఈ మేరకు కొత్త బస్సుల టెండర్లు పిలవడం, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతోంది. మరో వారం పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుందని భావిస్తున్నారు.

కొత్త రూట్లు, నూతన సర్వీసుల కారణంగా మొత్తం 1,016 బస్సులు హైదరాబాద్ నగరానికి రానున్నాయి. ఆర్డినరీ బస్సులతో పాటు దూరప్రాంతాలకు నడిపే వోల్వో బస్సులు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్‌ బస్సులూ వచ్చే అవకాశాలున్నాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ఈ మార్గాల్లో అద్దె బస్సులు నడిపి ప్రయాణికులకు సౌకర్యం కల్పించే లక్ష్యంతో గ్రేటర్‌జోన్‌ కసరత్తు చేస్తోంది. మొత్తానికైతే నగర శివార్లను కలుపుతూ బస్సులు నడపాలనే ప్రతిపాదనలో అధికారులు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి