TSRTC: హమ్మయ్యా.. పురుషులకు ప్రత్యేక బస్సులు. హైదరాబాద్‌లో..

బస్సుల్లో రద్దీ కారణంగా గొడవలు జరుగుతోన్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పురుషులకు ప్రత్యేక బస్సులు నడపాలనే డిమాండ్‌ వస్తోంది. అయితే తొలిసారిగా ఆర్టీసీ అధికారులు ఈ దిశగా అడుగు వేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో పురుషుల..

TSRTC: హమ్మయ్యా.. పురుషులకు ప్రత్యేక బస్సులు. హైదరాబాద్‌లో..
TSRTC
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 01, 2024 | 7:11 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకానికి పెద్ద ఎత్తున ఆదరణ లభించిన విషయం తెలిసిందే. మహిళలకు అందిస్తోన్న ఈ ఉచిత బస్సు ప్రయాణం కారణంగా బస్సుల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. దీంతో పురుషులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు అడపాదడపా చోటు చేసుకుంటున్నాయి.

బస్సుల్లో రద్దీ కారణంగా గొడవలు జరుగుతోన్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పురుషులకు ప్రత్యేక బస్సులు నడపాలనే డిమాండ్‌ వస్తోంది. అయితే తొలిసారిగా ఆర్టీసీ అధికారులు ఈ దిశగా అడుగు వేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో పురుషుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసును గురువారం ప్రారంభించారు. రద్దీ సమయాల్లో ఆర్టీసీ ఉపయోగించే యువకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పురుషుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించింది.

కాలేజీలకు వెళ్లే వారిని దృష్టిలో పెట్టుకొని ఇబ్రహీంపట్నం-ఎల్‌బి నగర్ రూట్‌లో మొదటి “పురుషుల ప్రత్యేక” సేవను బస్సును ప్రారంభించింది. ఈ మార్గంలో ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి బస్సు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుంది, సాయంత్రం చివరిగా బస్సు 4.30 గంటలకు తిరిగి మార్గంలో వెళ్తుంది.

Rtc

ఇదిలా ఉంటే తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. పథకం ప్రారంభం తర్వాత హైదరాబాద్‌లో సుమారు 31 శాతం మహిళలు హైదరాబాద్‌లో ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇక రోజువారీ ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్న మహిళల శాతం 52 నుంచి 81 శాతానికి పెరిగిందని, ఓ సర్వేలో తేలింది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..