TGSRTC: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. అక్కడికి వెళ్లేందుకు ఆర్టీసీ ఫ్రీ బస్సులు.. ఇక పండుగే పండుగ
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్యూచర్ సిటీకి ఫ్రీ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల గ్లోబల్ సమ్మిట్‌కు భారీగా స్పందన రావడం, తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివచ్చిన క్రమంలో ప్రజల సందర్శన కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

Future City: హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. డిసెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లాలోని ప్యూచర్ సిటీకి ఫ్రీ బస్సులు నడపనుంది. ప్యూచర్ సిటీకి వెళ్లాలనుకునేవారు ఈ ఉచిత బస్సులను ఉపయోగించుకోవచ్చని ఈడీ ఎం.రాజశేఖర్ స్పష్టం చేశారు. గురువారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉండే ఈ బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సేవలు అందించనున్నాయి. జేబీఎస్, శంషాభాద్, ఎంజీబీఎస్, ఉప్పల్ మియాపూర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్ నుంచి ఉచిత బస్సులు ప్యూచర్ సిటీకి వెళ్లనున్నాయి. ఇటీవల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను రేవంత్ సర్కార్ గ్రాండ్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్యూచర్ సిటీని సందర్శించాలనుకునేవారి కోసం ఉచిత బస్సులను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది
మూడు రోజుల పాటు ఉచిత బస్సులు
ప్రతిరోజు ఉదయం 9,10,11,12 గంటలకు ఈ బస్సులు ఆయా ప్రాంతాలను నుంచి ప్యూచర్ సిటీకి వెళ్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇక సాయంత్రం 4,5,6,7 గంటలకు తిరిగి ప్యూచర్ సిటీ నుంచి తిరిగి వస్తాయని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 9959226160 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న ప్యూచర్ సిటీని సందర్శించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల గ్లోబల్ సమ్మిట్‌లో భారీగా పెట్టుబడులు వచ్చిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
భారీగా పెట్టుబడులు
ఇటీవల రెండు రోజుల పాటు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి అతిథులు తరలివచ్చారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణకు ఏకంగా రూ.5,75,00 కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి. ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ అని రేవంత్ సర్కార్ చెబుతోంది. తొలిరోజు రూ.2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరగ్గా.. రెండో రోజు రూ.3,32,000 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు రేవంత్ సర్కార్ తెలిపింది. ఈ పెట్టుబడులతో రాష్ట్రం అభివృద్ది దిశగా మరింత దూసుకెళ్తుందని, నిరుద్యో్గులకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
