ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బుల్లెట్ బైకు దొంగల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి 26 లక్షల విలువైన 15 బైకులను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.