అల్లూరి సీతారామరాజు జిల్లా మేడూరు గ్రామంలో ఫోన్ వాడకంపై తలెత్తిన తగాదా దారుణానికి దారితీసింది. భార్య గంటల తరబడి ఫోన్ మాట్లాడటంపై అభ్యంతరం చెప్పిన భర్త కొర్ర రాజారావుపై ఆమె గొడ్డలితో దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన రాజారావు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి భార్యను అదుపులోకి తీసుకున్నారు.