Hyderabad: అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఇవిగో వివరాలు
హైదరాబాద్‌లో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పలు ఏరియాల్లో ట్రాఫిక్ రూల్స్ విధించారు పోలీసులు. ఆంక్షలను దృష్టిలోపెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు సీపీ. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం....

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్, పరేడ్‌గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్‌బండ్‌పై ఇవాళ ఉదయం నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్ వద్ద ఉదయం 9 గంటల నుంచి 10గంటల వరకు, పరేడ్‌గ్రౌండ్ పరిసరాల్లో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని తెలిపారు హైదరాబాద్ సీపీ సీపీ కె.శ్రీనివాస్ రెడ్డి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు. గన్ పార్క్ దగ్గర ఉదయం 9.30గంటలకు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పిస్తారని చెప్పారు. అప్పర్ ట్యాంక్ బండ్‌పై ఇవాళ రాత్రి 12 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని చెప్పారు పోలీసులు.
నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపునకు వచ్చేవాహనాలను రాణిగంజ్ వైపునకు మళ్లిస్తారు. రాణిగంజ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపునకు వచ్చే వాహనాలను మినిస్టర్ రోడ్ వైపునకు మళ్లిస్తారు. వీవీ స్టాచ్యూ వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపునకు వచ్చే వాహనాలను నల్లగుట్ట వైపు నకు పంపుతారు. పాత సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ వైపునుంచి వచ్చేవాహనాలను రవీంద్రభారతి వైపునకు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ వైపునుంచి వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా స్టీల్‌బ్రిడ్జి వైపున కు పంపుతారు. లిబర్టీ, బషీర్‌బాగ్ వైపునుంచి వచ్చేవాహనాలను అంబేడ్కర్ విగ్రహం నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపునకు మళ్లిస్తారు. బండమైసమ్మ క్రాస్‌రోడ్ నుంచి వచ్చేవాహనాలను ఇందిరాపార్క్ వైపునకు పంపుతారు. కవాడిగూడ వైపునుంచి వచ్చేవాహనాలను బైబిల్ హౌస్, డీబీఆర్ మిల్స్ వైపునకు పంపుతారు. ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని, ప్రత్యామ్నాయ మార్గా ల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
#HYDTPinfo #TrafficAlertCommuters, please make a note of #TrafficAdvisory in view of #TelanganaStateFormationDay Celebrations at #UpperTankbund on 𝟎𝟏-𝟎𝟔-𝟐𝟎𝟐𝟒 from 𝟎𝟎𝟎𝟎 hours to 𝟐𝟒𝟎𝟎 hours on 𝟎𝟐-𝟎𝟔-𝟐𝟎𝟐𝟒.Kindly reach us on #9010203626 for travel assistance pic.twitter.com/BF5C68TQIE
— Hyderabad Traffic Police (@HYDTP) June 1, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..