Telangana: వారితో చేతులు కలిపి సోనియాకు వెన్నుపోటు పొడిచారు.. రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ షాకింగ్ కామెంట్స్

కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే పదవిని వీడుతున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revant Reddy) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లతో చేతులు కలిపి తెలంగాణ...

Telangana: వారితో చేతులు కలిపి సోనియాకు వెన్నుపోటు పొడిచారు.. రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ షాకింగ్ కామెంట్స్
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 03, 2022 | 10:10 AM

కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే పదవిని వీడుతున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revant Reddy) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లతో చేతులు కలిపి తెలంగాణ తల్లి సోనియా గాంధీకి వెన్నుపోటు పొడిచారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ సిద్ధమైందని, ఈ నెల ఐదో తేదీన మునుగోడులో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డిని (Rajagopal Reddy) మునుగోడు ప్రజలు సోనియాగాంధీ ప్రతినిధిగా గెలిపిస్తే.. ఆయన మాత్రం అవేవీ పట్టించుకోకుండా వారి నమ్మకాన్ని వమ్ము చేశారని మండిపడ్డారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని మరోసారి నిరూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ ఎంతో చేసిందని, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని, అది ఉండగానే ఎమ్మెల్యే సీటు ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అంతే కాకుండా కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లపై ఆగ్రహంతో రేవంత్ రెడ్డి ట్వీట్లు చేశారు. ఇవి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

నూటికి నూరు శాతం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ఆయన శ్రమిస్తారు. మాకు ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంది. నీళ్ల విషయంలో తెలంగాణకు చాలా అన్యాయం జరుగుతోంది. వీటిపై సమాధానం చెప్పేంత వరకు బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోడీ అవహేళన చేశారు. పార్లమెంట్‌ చట్టం ద్వారా ఏర్పడిన తెలంగాణను తప్పుపట్టారు. మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ రెడీ.

ఇవి కూడా చదవండి

– రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

కాగా.. మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా పై క్లారిటీ ఇచ్చేశారు. కుండబద్దలు కొట్టినట్లు తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల కోరిక మేరకు రాజీనామా చేస్తున్నానని, డబ్బులు, పదవి కోసం అమ్ముడు పోనని స్పష్టం చేశారు. కష్టపడి వ్యాపారంలో సంపాదించిన సొమ్మును పేదలకు ఖర్చు చేశానన్న రాజగోపాల్ రెడ్డి.. నిజంగా తాను స్వార్థపరుడైతే 2018లోనే టీఆర్‌ఎస్‌లో చేరే వాడినని వివరించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే