Azadi ka amrit mahotsav: స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలపై సీఎం కేసీఆర్ రివ్యూ..

Azadi ka amrit mahotsav: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో..

Azadi ka amrit mahotsav: స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలపై సీఎం కేసీఆర్ రివ్యూ..
Cm Kcr
Follow us

|

Updated on: Aug 02, 2022 | 9:56 PM

Azadi ka amrit mahotsav: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. 75ఏళ్ల ఇండిపెండెంట్ ఇండియా సెలబ్రేషన్స్‌ నిర్వహణపై మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. ప్రతి ఇంటిపై జాతీయ జెండా, ప్రతి గుండెలో భారతీయత నింపేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీకి దిశానిర్దేశం చేశారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం పేరుతో వేడుకలు జరపాలని సూచించారు. ఆగస్ట్‌ 8నుంచి 22వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్‌. దేశ సమైక్యత, దేశ భక్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఆగష్టు 15న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హర్‌ ఘర్‌ తిరంగా ప్రోగ్రామ్‌ విజయవంతమయ్యేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కచ్చితంగా ప్రతి ఇంటిపై మువ్వెన్నల జాతీయ జెండా ఎగిరేలా చూడాలన్నారు. ప్రతి ఇంటికీ జాతీయ జెండాను పంపిణీ చేసే పనిని ఈనెల 9నుంచి చేపట్టాలన్నారు సీఎం కేసీఆర్‌.

మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వరంలో నేషనల్‌ ఫ్లాగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ జరగాలని సూచించారు. రాష్ట్రంలో కోటీ 20లక్షల ఇళ్లకు జాతీయ జెండాలను ఉచితంగా అందించనున్నారు. అలాగే, దేశభక్తిని పెంపొందించే సినిమాలను విద్యార్ధులకు ఉచితంగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆగష్టు 8న ప్రారంభమయ్యే వజ్రోత్సవ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని సూచించారు సీఎం కేసీఆర్‌. వజ్రోత్సవ వేడుకల ప్రారంభ వేడుకను హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో రెండు వేల మంది ప్రముఖుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆర్మీ అండ్ పోలీస్‌ బ్యాండ్స్‌తో రాష్ట్రీయ సెల్యూట్‌, జాతీయ గీతాలాపన, స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ తీసుకున్న మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు..

• బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, స్టార్ హోటల్లు, దవాఖానాల్లో, షాపింగ్ మాల్స్ లలో ప్రత్యేకాలంకరణలను చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలి.

• ప్రభుత్వ భవనాలు ఇతర ప్రతిష్టాత్మక భవనాలను ముఖ్యమైన పబ్లిక్ ప్లేసుల్లో ఈ పదిహేను రోజుల పాటు విద్యుత్ దీపాలు, ప్రత్యేకాలంకరణలను ఏర్పాటు చేయాలి. జాతీయ జెండా ఎగరవేయాలి.

• ప్రభుత్వ మరియు ప్రయివేట్ పాఠశాల, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు, వక్తృత్వ పోటీ , వ్యాస రచన పోటీ, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు.

• ఉపాధ్యాయులు, లెక్చరర్లకు దేశభక్తి పై కవితారచన పోటీలు నిర్వహించాలి.

• ప్రతిరోజూ ప్రార్థన సమయంలో అన్ని రకాల విద్యాసంస్థల్లో ఎంపిక చేసిన దేశభక్తి గీతాలను మైకుల ద్వారా వినిపించాలి.

• రిచర్డ్ అటెన్ బరో నిర్మించి దర్శకత్వం వహించిన ‘గాంధీ’ సినిమాను రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిరోజూ ప్రదర్శించాలి.

• గ్రామం మండల జిల్లా రాష్ట్ర స్థాయిల్లో ఫ్రీడం కప్ పేరుతో ఆటల పోటీల నిర్వహించాలి. విజేతలకు బహుమతులు ప్రధానం చేయాలి.

• వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారిని కలుపుకొని ప్రత్యేక ర్యాలీలు నిర్వహించాలి.

• ఈ పదిహేను రోజుల వేడుకల్లో వొక రోజున రాష్ట్రమంతటా ఏక కాలంలో, ఎక్కడివాల్లక్కడ ‘తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన’జరిపించాలి. ఇందుకు పోలీసు శాఖ బాధ్యత వహించాలని డిజిపి మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచన.

• స్వాతంత్ర్య సమరం ఇతివృత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కవిసమ్మేళనాలను, ముషాయిరాలను నిర్వహించాలని సాంస్కృతిక శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం.

• వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలి. ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేయాలి.

• యువతీయువకులు క్రీడాకారులు ఇతర వర్గాల భాగస్వామ్యంతో ప్రీడం 2కె రన్ నిర్వహించాలి.

• స్వాతంత్ర్య స్పూర్తిని రగలించే విధంగా బెలూన్ల ప్రదర్శన.

• రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రక్తదాన శిబిరాలను నిర్వహించాలి.

• దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో, జైల్లల్లో, వృద్ధాశ్రమాలల్లో పండ్లు స్వీట్లు పంచాలి.

• వజ్రోత్సవాల సందర్భంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలి. దాంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయితీలు, మండల పరిషత్, జిల్లాపరిషత్, మున్సిపల్ సహా ప్రజల చేత ఎన్నిక కాబడిన అన్ని రకాల లోకల్ బాడీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

• ఈ వజ్రోత్సవ సమాశాల్లో స్వాతంత్య్ర పోరాట వీరులకు ఘన నివాళులు అర్పించాలని నిర్ణయించారు.

• వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 15 ఆగస్టుకు ముందురోజు, 14న తాలుకా, జిల్లా కేంద్రాల్లో, హైద్రాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా బాణాసంచా కార్యక్రమాలను నిర్వహించాలి.

• జిల్లా స్థాయిలో ఇంచార్జీ మంత్రి అధ్యక్షులుగా కలెక్టరు, కన్వీనర్ గా వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సభ్యులుగా ప్రత్యేక నిర్వహణ కమిటీలు వేయాలని నిర్ణయించారు.

• దేశ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ గాయకులు, సంగీత విద్వాంసులతో ప్రత్యేక సంగీత విభావరిని నిర్వహించాలి.

• సమాజంలోని అట్టడుగు వర్గాలను, నిరాదరణకు గురైన వర్గాలను గుర్తించి ఆదుకోవడం కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.

• జిల్లాకొక ఉత్తమ గ్రామ పంచాయితీని, మున్సిపాలిటీని, పాఠశాల, ఉత్తమ రైతు, డాక్టర్, ఇంజనీరు, పోలీస్ అధికారి, తదితర ఉద్యోగులు, కళాకారుడు, గాయకుడు, కవిని గుర్తించి సత్కరించాలని నిర్ణయించారు.

• రవీంద్రభారతిలో 15 రోజుల పాటు స్వాతంత్ర్య సమర స్పూర్తి ఉట్టిపడే విధంగా ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా నిర్వహించే రోజు వారీ కార్యక్రమాలు..

ఆగస్టు 08 : ‘స్వతంత్ర భాతర వజ్రోత్సవ ద్విసప్తాహం’ ప్రారంభోత్సవ కార్యక్రమాలు

ఆగస్టు 09 : ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభోత్సవం.

ఆగస్టు 10 : వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా.. గ్రామ గ్రామాన మొక్కలు నాటడం. ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటు చేయడం.

ఆగస్టు 11 : ఫ్రీడమ్ రన్ నిర్వహణ

ఆగస్టు 12 : రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియాల సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్జప్తి.

ఆగస్టు 13 : విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సమాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు.

ఆగస్టు 14 : సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియాజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్క్రతిక జానపద కార్యక్రమాలు. ప్రత్యేకంగా బాణాసంచాతో వెలుగులు విరజిమ్మడం.

ఆగస్టు 15 : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఆగస్టు 16 : ఏక కాలంలో ఎక్కడివారక్కడ తెలంగాణ వ్యాప్తంగా సమూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ.

ఆగస్టు 17 : రక్తదాన శిబిరాల నిర్వహణ.

ఆగస్టు 18 : ఫ్రీడం కప్’ పేరుతో క్రీడల నిర్వహణ

ఆగస్టు 19 : దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైల్లలో ఖైదీలకు పండ్లు స్వీట్ల పంపిణీ.

ఆగస్టు 20 : దేశభక్తిని, జాతీయ స్పూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు.

ఆగస్టు 21 : అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. దాంతో పాటు ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం.

ఆగస్టు 22 : ఎల్బీస్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..