AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హిందూ ఆలయాలపై వరుస దాడులు.. కలకలం రేపుతోన్న సంఘటనలు

హిందూ ఆలయాలపై జరుగుతోన్న వరుస దాడులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల శంషాబాద్ ప్రాంతంలో జరిగిన వరుస సంఘటనలు ప్రజల్లో ఆందోళన మరింత పెరగడానికి కారణమైంది. రోజుల వ్యవధిలోనే ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి...

Hyderabad: హిందూ ఆలయాలపై వరుస దాడులు.. కలకలం రేపుతోన్న సంఘటనలు
Hyderabad
Peddaprolu Jyothi
| Edited By: Narender Vaitla|

Updated on: Nov 10, 2024 | 3:39 PM

Share

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వారం రోజుల వ్యవధిలో వరుసగా మూడు దేవాలయాలపై దాడులు జరగడం తీవ్రం కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం దాడి ఘటన మరవకముందే కొద్ది రోజులు వివిధలోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కాలనీలో మరో దాడి జరిగింది. ఈ కాలనీలో ఉన్న హనుమాన్‌ దేవాలయంలోని నవగ్రహాల విగ్రహాల ధ్వంసం జరిగింది.

గుర్తు తెలియని వ్యక్తులు నవగ్రహాల విగ్రహాలను కిందపడేసి విరగ్గొట్టారు. ఉదయం ఆలయంలో పూజ చేయడానికి వచ్చిన పూజారి విరిగిన విగ్రహాలను చూసి పోలీసులకు, స్థానికులకు సమాచారం అందించాడు. అనంతరం స్థానికులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయాలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని శంషాబాద్ డీజీపీకి లేఖ రాశారు.

అయితే ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల వ్యవధిలోనే శంషాబాద్ బెంగళూరు హైవే మీద ఉన్న కట్టమైసమ్మ ఆలయంలో మరో సంఘటన చోటు చేసుకుంది. ఆలయం ఎదురుగా ఉన్నటువంటి త్రిశూలాన్ని ఓ వ్యక్తి విరగొట్టాడు. అది గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు. ఎవరు అని ప్రశ్నించగా అమ్మ విరగొట్టమంది అంటూ వింత సమాధానాలు చెప్పాడు. దీంతో స్థానికులు ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జరిగన ఒక్క రోజు తర్వాత జుక్కల్ గ్రామంలో పోచమ్మ దేవాలయంలో మరొక ఘటన చోటు చేసుకుంది.

అమ్మవారి చీరను తీసి బయట పడవేయడంతో పాటు అమ్మవారి కంటిని పీకేశారు. అక్కడే ఉన్న వ్యక్తిని స్థానికులు బంధించారు. సదరు వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు స్పష్టమైంది. ఇలా దేవాలయాలపై వరుసగా జరుగుతోన్న దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనకు దిగిన ప్రజలు.. పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. వరుస దాడులు జరుగుతున్నా పోలీస్ శాఖ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులు అన్ని దేవాలయాలకు జియో టాకింగ్ చేశామని దేవాలయాల దగ్గర వాచ్‌మెన్‌తో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెబుతున్నారు. ఆలయాలకు తప్పకుండా తాళాలు వేయాలని సూచిస్తున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లక్ చేయండి..