Inter Exams: తెలంగాణలో జూలై రెండో వారంలో ఇంటర్ పరీక్షలు.! పరీక్షా సమయం కుదింపు.!!
సీబీఎస్ఈ బోర్డు కూడా జూలైలో 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతుండటంతో.. రాష్ట్రంలోనూ జూలై రెండో వారంలో పరీక్షలు..
Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలను జూలై రెండో వారంలో నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే కచ్చితంగా పరీక్షలు నిర్వహించేందుకే మొగ్గు చూపుతోందట. అంతేకాకుండా విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రశ్నాపత్రాల్లో మార్పులు, పరీక్షా సమయాన్ని సైతం కుదించినట్లు సమాచారం. ఇటీవల కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అధ్యక్షతన రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులతో జరిగిన వర్చువల్ మీటింగ్‌లో జూన్ నెలాఖరున ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే జూన్ నెల చివరి వారానికి కరోనా అదుపులోకి వస్తుందో.? లేదో.? అనే సందేహం అధికారులలో నెలకొంది. దీనితో పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాతే ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారట.
అటు సీబీఎస్ఈ బోర్డు కూడా జూలైలో 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతుండటంతో.. రాష్ట్రంలోనూ జూలై రెండో వారంలో పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు కరోనా, లాక్‌డౌన్ కారణంగా విద్యార్ధులపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటర్ బోర్డు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇప్పటికే సిద్దం చేసిన ప్రశ్నాపత్రాలను వినియోగించుకోవాలని భావిస్తున్న బోర్డు.. వాటిల్లో సగం ఛాయిస్ ఉండేలా చర్యలు చేపడుతోంది. అంటే విద్యార్ధులు సగం ప్రశ్నలకు జవాబులు రాస్తే చాలు.. వాటికి వేసే మార్కులను రెట్టింపు చేసి తుది మార్కులు ఇస్తారు. అలాగే పరీక్షా సమయాన్ని సైతం 90 నిమిషాలకే కుదించాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, జూలైలో ఇంటర్ సెకండియర్ పరీక్షలతో పాటు మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం.. జూలైలో నిర్వహించే పరీక్షలు విద్యార్ధులకు ఆప్షన్‌గా నిర్వహించే అవకాశం ఉందట.
Also Read:
మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?
టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?
సర్కస్ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!