AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T Safe APP: మహిళలకు అరచేతిలో ఆయుధం.. టీ సేఫ్‌ యాప్‌..

యాప్‌ ద్వారా తమ సమస్యను తెలియజేస్తే చాలు వెంటనే వ్యక్తి లొకేషన్‌ ఆధారంగా దగ్గర్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు మెసేజ్‌ వెళ్తుంది. దీంతో అలర్ట్‌ అయ్యే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటారు. మెసేజ్‌ వచ్చిన కేవలం 5 నిమిషాల్లోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలా ఈ యాప్‌ను డిజైన్‌ చేశారు. ఒకవేళ లోకేషన్‌లో ఏమాత్రం మార్పు వచ్చినా వెంటనే డికెట్ట్‌ చేసే...

T Safe APP: మహిళలకు అరచేతిలో ఆయుధం.. టీ సేఫ్‌ యాప్‌..
T Safe
Narender Vaitla
|

Updated on: Mar 23, 2024 | 2:38 PM

Share

మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ భద్రత విభాగం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ట్రావెల్ సేఫ్‌’ పేరుతో తీసుకొచ్చిన యాప్‌ సహాయంతో ఆపద సమయాల్లో మహిళలకు రక్షణ కవచంలా ఈ యాప్‌ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. మహిళలు ఒంటరింగ ప్రయాణిస్తున్న సమయంలో ఎవరైనా ఆకతాయిల నుంచి ఇబ్బందులు ఎదురైతే ఈ యాప్‌ ద్వారా సమాచారం ఇవ్వొచ్చు.

యాప్‌ ద్వారా తమ సమస్యను తెలియజేస్తే చాలు వెంటనే వ్యక్తి లొకేషన్‌ ఆధారంగా దగ్గర్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు మెసేజ్‌ వెళ్తుంది. దీంతో అలర్ట్‌ అయ్యే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటారు. మెసేజ్‌ వచ్చిన కేవలం 5 నిమిషాల్లోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలా ఈ యాప్‌ను డిజైన్‌ చేశారు. ఒకవేళ లోకేషన్‌లో ఏమాత్రం మార్పు వచ్చినా వెంటనే డికెట్ట్‌ చేసే టెక్నాలజీని ఈ యాప్‌లో తీసుకొచ్చారు. ఈ యాప్‌ను యూజర్లు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

టీసేఫ్‌ యాప్‌ను డౌనల్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ఫోన్‌ నెంబర్‌తో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఇతర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. అనంతరం యాప్‌లో మీ పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడీ వివరాలను అందించాల్సి ఉంటుంది. ఇక మీరు ప్రయాణిస్తున్న వివరాలను యాప్‌లో ఎంటర్‌ చేస్తే చాలు ఆ వివరాలన్నీ పోలీసుల నిఘాలోకి వెళ్లిపోతాయి.

ఇక ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న యూజర్లు.. రాష్ట్ర సరిహద్దు దాటినా, ఎక్కువ సమయం ఒకేచోట ఆగినా, ప్రయాణ మార్గం మారినా వెంటనే క్రంటోల్‌ రూమ్‌కు కాల్‌ వెళ్తుంది. ఒకవేళ మీరు కాల్‌కు స్పందించకపోతే నిమిషాల వ్యవధిలోనే పోలీసులు మీరున్న ప్రదేశానికి వస్తారు. ఇందుకోసం గాను ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వెహికిల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 791 పాట్రోల్‌ కార్లు, 1085 టూ వీలర్‌ బైక్‌లను ఉపయోగిసత్ఉన్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..