Watch Video: అర్థరాత్రి రోడ్డు ప్రమాదం.. అగ్గికి ఆహుతైన కారు..
అర్థరాత్రి ఉప్పల్ స్టేడియం వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు రోడ్డు డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో ఉన్న పళంగా మంటలు వ్యాపించాయి.
అర్థరాత్రి ఉప్పల్ స్టేడియం వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు రోడ్డు డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో ఉన్న పళంగా మంటలు వ్యాపించాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఈ కారు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కార్ స్పీడ్ కంట్రోల్ చేయలేక పోవడంతోనే డివైడర్ను తాకి ఆ పక్కన ఉన్న కరెంటు పోల్‌ని బలంగా గుద్దినట్లు ప్రాథమికంగా నిర్థారణ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెల్లరేగి కారు పూర్తిగా కాలి బూడిదైంది. తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ఉన్న TS09 7001 కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రమాద జరిగిన వెంటనే బయటకు దూకేయడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేపట్టినట్లు చెబుతున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

