AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై మొబైల్‌ యాప్‌లో నెహ్రూ జూ పార్క్‌ టికెట్లు.

ప్రతీ రంగంలో టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. ఇంటర్‌నెట్ అందరికీ అందుబాటులోకి రావడం, స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరగడంతో ప్రభుత్వ సంస్థలు కూడా టెక్నాలజీ వినియోగాన్ని పెంచేశాయి. ఈ క్రమంలోనే వినియోగదారులకు సేవలను మరింత చేరువ చేసేందుకు...

Hyderabad: పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై మొబైల్‌ యాప్‌లో నెహ్రూ జూ పార్క్‌ టికెట్లు.
Narender Vaitla
|

Updated on: Feb 13, 2023 | 12:34 PM

Share

ప్రతీ రంగంలో టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. ఇంటర్‌నెట్ అందరికీ అందుబాటులోకి రావడం, స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరగడంతో ప్రభుత్వ సంస్థలు కూడా టెక్నాలజీ వినియోగాన్ని పెంచేశాయి. ఈ క్రమంలోనే వినియోగదారులకు సేవలను మరింత చేరువ చేసేందుకు వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌లో ఉన్న నెహ్రూ జూ పార్క్‌లో ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్త వెబ్‌సైట్‌తో పాటు, ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను సైతం విడుదల చేశారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఇటీవల వీటిని ప్రారంభించారు. సందర్శకులు సులువుగా జూ ఎంట్రీ టికెట్ బుకింగ్, బ్యాటరీ వెహికల్స్ ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకుని సదుపాయం కల్పించారు. ఇకపై జూపార్క్‌ వచ్చి లైన్‌లో నిల్చునే అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే బుకింగ్ చేసుకోవచ్చన్నమా. సెంటర్‌ ఫర్‌ గుడ్ గవర్నెన్స్ ద్వారా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమానికి సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే, పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, అటవీ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రశాంతి, జూ పార్క్ క్యురేటర్ రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ లింక్ ద్వారా ఆన్ లైన్ సేవలు పొందొచ్చు.

Nehru Zoological Park

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో చూడదగిన పర్యాటక ప్రదేశాల్లో నెహ్రూ జూపార్క్‌ ఒకటి. దేశంలోనే అతిపెద్ద జూపార్క్‌గా పేరు తెచ్చుకున్న నెహ్రూ జూ పార్క్‌కు 1959లో బీజం పడగా.. అక్టోబరు 12, 1963 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జీవవైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ‘నెహ్రూ జులాజికల్ పార్క్’ 380 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ జంతు ప్రదర్శనశాలలో దాదాపు 1,500 జాతుల జంతువులు, పక్షులు ఆవాసం ఉంటున్నాయి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..