Minister Duddilla Sridhar Babu: ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్.. నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్! వీడియో

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఓ కారు అదుపుతప్పి ఫుట్ పాత్ పై అడ్డంగా పడిపోవడంతో దానిని తొలగించి.. రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ ను నిమిషాల్లో క్లియర్ చేశారు..

Follow us
Ashok Bheemanapalli

| Edited By: Srilakshmi C

Updated on: Dec 02, 2024 | 9:47 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2: హైదరాబాద్‌లో ట్యాంక్‌ బండ్‌ వద్ద ఆదివారం రాత్రి ఓ కారు భీభత్సం సృష్టించింది. ట్యాంక్ బండ్ వైపు నుంచి వస్తున్న కారు అంబేద్కర్ కూడలి వద్ద అదుపు తప్పి ఒక్కసారిగా ఫుట్ పాత్ పైకి దూసుకుపోయింది. దీంతో వాహనదారులకు అడ్డగా ఉండటంతో అక్కడ భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్యార్టర్స్‌ నుంచి యూటర్న్ తీసుకుని సెక్రటేరియట్ వైపు వెళ్తున్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తన వాహనం ఆపి దిగి స్వయంగా ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఫుట్‌పాత్‌పై ఉన్న కారును అక్కడి నుంచి పక్కకు జరిపారు.

ఈ లోగా మంత్రి శ్రీధర్ బాబు వ్యక్తిగత సహాయకులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దెబ్బతిన్న కారును దూరంగా తీసుకెళ్లి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. దాదాపు పది నిమిషాల సేపు అక్కడే ఉన్న శ్రీధర్ బాబు ట్రాఫిక్ అవాంతరం తొలగిన తర్వాత బయలు దేరి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర