Hyderabad: హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక ఫార్మా కంపెనీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌.. భారీ పెట్టుబడులతో..

Hyderabad: ప్రపంచస్థాయి ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో (Software companies) ఫార్మా రంగానికి (Pharma) కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక కంపెనీ తమ కార్యకలాపాలను ప్రారంభించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్‌ను...

Hyderabad: హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక ఫార్మా కంపెనీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌.. భారీ పెట్టుబడులతో..
Hyderabad
Follow us

|

Updated on: Apr 25, 2022 | 5:07 PM

Hyderabad: ప్రపంచస్థాయి ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో (Software companies) ఫార్మా రంగానికి (Pharma) కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక కంపెనీ తమ కార్యకలాపాలను ప్రారంభించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్‌ను (Ferring Pharma) సోమవారం ప్రారంభించింది. శామీర్‌పేట్‌లోని టీఎస్‌ఐఐసీ బయోటెక్‌ పార్క్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ. రామారావు ప్లాట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఫెర్రింగ్ లాబొరేటరీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్లాంట్‌ను ప్రారంభించిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. ఫెర్రింగ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 30 బిలియన్ యూరోల పెట్టుబడులతో హైదరాబాద్‌లో ప్లాంట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్లాంట్‌ ద్వారా ప్రస్తుతం 110 ఉద్యోగాలు లభించాయని తెలిపిన మంత్రి, భవిష్యత్తుల్లో మరిన్ని ఉద్యోగావకాశాలు రానున్నాయని తెలిపారు. స్విట్జర్లాండ్‌ వేదికగా కార్యకలాపాలు జరుపుకునే ఈ కంపెనీ తల్లి, బిడ్డల ఆరోగ్యానికి కావాల్సిన మందులు ఇక్కడ తయారు చేస్తుందని మంత్రి తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్‌ ఫార్మా కృషి చేయడం గొప్ప విషయమని మంత్రి అభినందించారు.

Ktr

ఇక శామీర్‌పేటలో ఉన్న జీనోమ్‌ వ్యాలీ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఉన్నతమైన ప్రమాణాలతో కొనసాగుతుందని తెలిపిన మంత్రి, లైఫ్ సైన్సెస్ సెక్టార్ లో హైదరాబాద్ మరింత పురోగమిస్తోందని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది నాటికి ఫార్మా రంగంలో మరింత ముందుకు వెళుతుందని తెలిపిన కేటీఆర్‌.. లైఫ్ సైన్సెస్ సెక్టార్ లో నగరం ప్రపంచ దేశాలతో పోటీపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Fact Check: దేశంలోని విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్స్‌.. వైరల్ అవుతోన్న ఈ వార్తలో నిజమెంత..?

Telangana: అక్కడ కలువకుండా కేసీఆర్‌ను కలిస్తే అనుమానాలు వచ్చేవి.. కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు కామెంట్స్

Military Expenditure: తగ్గేదేలే.. ఆ విషయంలో అమెరికా, చైనా తర్వాత ఇండియానే..!