రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త… మే నెల బియ్యం కోటా విడుదల..
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు వేల కొద్ది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో...
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు వేల కొద్ది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వం మరోమారు లాక్‌డౌన్ విధిస్తుందనే భయం రోజు కూలీలను వెంటాడుతూనే ఉంది. చాలామందికి పనులు దొరకక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అనేక మంది నగరాల నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో పేదలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
రేషన్ కార్డు ఉన్నవారందరికీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కష్టకాలంలో ఆదుకునేందుకు మరోసారి సర్కార్ సిద్ధమవుతోంది. కరోనా సెకండ్ వేవ్‌తో మరోసారి ప్రజలంతా కష్టాల్లోకి వెళ్లిపోతున్నారు. కొందరికి ఉపాధి లేకుండా పోయింది. మరికొందరు పని ఉన్నా కూడా కరోనా భయంతో బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం కోటా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఇస్తున్న ఐదు కిలోల ఉచిత బియ్యంతో కలిపి రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మే నెల కోటా బియ్యం ఇవ్వనుంది. ఈ మేరకు వచ్చే నెలకు సంబంధించిన కోటాను విడుదల చేసింది. జూన్ నెలలో కూడా ఇదే విధంగా పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 82.50 లక్షల రేషన్ కార్డుదారులకు 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నది.
Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?
ఈనెల 28 నుంచి జూన్ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..
ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!