AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mnister KTR: కేటీఆర్‌తో అట్లుంటది మరి.. నీలోఫర్ కేఫ్‌లో మంత్రి సందడి.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉంటున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారక రామారావు బంజారాహిల్స్ నీలోఫర్ కేఫ్‌లో సందడి చేశారు. ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంగా నీలోఫర్ కేఫ్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్ అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. నీలోఫర్ కేఫ్‌లో చాయ్ తాగుతున్న పలు కుటుంబాలతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు.

Mnister KTR: కేటీఆర్‌తో అట్లుంటది మరి.. నీలోఫర్ కేఫ్‌లో మంత్రి సందడి.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Minister Ktr
Sridhar Prasad
| Edited By: |

Updated on: Nov 14, 2023 | 7:28 PM

Share

అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉంటున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారక రామారావు బంజారాహిల్స్ నీలోఫర్ కేఫ్‌లో సందడి చేశారు. ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంగా నీలోఫర్ కేఫ్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్ అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. నీలోఫర్ కేఫ్‌లో చాయ్ తాగుతున్న పలు కుటుంబాలతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రి కేటీఆర్ పైన ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాదులో ఉన్న శాంతి భద్రతలు, అభివృద్ధి అద్భుతంగా ఉన్నాయన్నారు.

బెంగళూరులో పని చేస్తున్న యువకుని కుటుంబంతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. బెంగళూరు నుంచి తన కుటుంబంతో గడిపేందుకు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ నగరం వినూత్నంగా కనిపిస్తుందని ముఖ్యంగా గత పది సంవత్సరాలలో హైదరాబాద్ అద్భుతంగా మార్పు చెందిందని ఆయన తెలిపారు. దశాబ్దాల క్రితం వారణాసి నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డామని.. అయితే, గత పది సంవత్సరాల్లో హైదరాబాద్ మారిన తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం కులాలు మతాలు.. ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి జీవించే వాతావరణన్ని కలిగి ఉందన్నారు.

ఆ తర్వాత పలువురు మహిళలతో మంత్రి కేటీఆర్ సంభాషించారు. తన కొడుకుకి కేటీఆర్ అంటే ప్రత్యేక అభిమానమని ఒక మహిళ తెలిపారు. మహిళలతో సంభాషిస్తున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ వారి కుటుంబ నేపథ్యం, ప్రభుత్వ పనితీరు పట్ల వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

వీడియో చూడండి..

ఆ తర్వాత మైనారిటీ కుటుంబంతో ముచ్చటించిన కేటీఆర్… వారి నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరం అద్భుతంగా ఉన్నదని ముఖ్యంగా మత ఘర్షణలు లేకుండా అందరికీ అన్ని అవకాశాలు అందిస్తున్న తీరుపట్ల మైనార్టీ కుటుంబం ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేసింది. మంత్రి కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తిలాగా చాయ్ తాగుతూ పలువురుతో సంభాషించడం చాలామందిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పలువురు కేటీఆర్ తో సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..