Watch Video: బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఆ పార్టీలు కలిశాయి.. మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు

Watch Video: బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఆ పార్టీలు కలిశాయి.. మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు

Janardhan Veluru

|

Updated on: Nov 14, 2023 | 7:28 PM

Telangana Polls 2023: బీజేపీ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి బీజేపీ సపోర్ట్ చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్‌‌లు ఢిల్లీలో కొట్టుకుంటాయి.. తెలంగాణలో కలిసిపోతాయని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు పోయి బీజేపీ గెలిచిందని.. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న బంధానికి ఇదే తార్కాణమన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేనంటూ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకే బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిశాయని ఆరోపించారు. బీజేపీ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోందన్నారు. అలాగే కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి బీజేపీ సపోర్ట్ చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్‌‌లు ఢిల్లీలో కొట్టుకుంటాయి.. తెలంగాణలో కలిసిపోతాయని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు పోయి బీజేపీ గెలిచిందని.. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న బంధానికి ఇదే తార్కాణమన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కోలేకే ఆ రెండు పార్టీలూ ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసినా కాంగ్రెస్ స్పందించడం లేదని ఆరోపించారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..

Published on: Nov 14, 2023 07:27 PM