పైసలు ఇళ్లలో పెట్టుకుని కూర్చుంటామా?.. ఐటీ దాడులపై రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Polls 2023: కాంగ్రెస్ పార్టీలో కోవర్టులపై స్పందిస్తూ.. మాకు కోవర్ట్‌లు ఉన్నారు.. వాళ్లకీ కోవర్ట్‌లు ఉన్నారంటూ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో ఎంతమంది కోవర్ట్‌లు ఉన్నారో మాకు తెలుసన్నారు. కోవర్ట్‌ల పనితీరు ఏంటో డిసెంబర్ 3న తెలుస్తుందని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబరు 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు, అభ్యర్థుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులపై ఐటీ దాడులు చేయించడం బీజేపీకి అలవాటేనని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నాయన్నారు. అయినా పైసలు ఇంట్లో పెట్టుకొని కూర్చుంటామా? అంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులపై స్పందిస్తూ.. మాకు కోవర్ట్‌లు ఉన్నారు.. వాళ్లకీ కోవర్ట్‌లు ఉన్నారంటూ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో ఎంతమంది కోవర్ట్‌లు ఉన్నారో మాకు తెలుసన్నారు. కోవర్ట్‌ల పనితీరు ఏంటో డిసెంబర్ 3న తెలుస్తుందని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబరు 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.