KCR On Budget: పనికి మాలిన.. పసలేని బడ్జెట్‌.. కేంద్ర పద్దుపై సీఎం కేసీఆర్‌ హాట్‌ కామెంట్స్‌..

KCR On Budget: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బడ్జెట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేంద్రం చాలా దారుణమైన బడ్జెట్‌ తీసుకొచ్చిందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్‌ పనికి మాలిన...

KCR On Budget: పనికి మాలిన.. పసలేని బడ్జెట్‌.. కేంద్ర పద్దుపై సీఎం కేసీఆర్‌ హాట్‌ కామెంట్స్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 01, 2022 | 5:34 PM

KCR On Budget: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బడ్జెట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేంద్రం చాలా దారుణమైన బడ్జెట్‌ తీసుకొచ్చిందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్‌ పనికి మాలిన, పసలేని బడ్జెట్‌ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శకుల దిగారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అందరికీ గుండు సున్నా ఇచ్చింది. రైతుల మరణాలకు కారణమైన ప్రధాని, వారి గురించి ప్రస్తావించకపోవడం దారుణం.

ఎరువులపై సబ్సిడీని తగ్గించారు. కరోనా సమంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతోన్న కార్మికులు నడ్డి విరుస్తూ.. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా కోతలు విధించారు. ఉపాధి హామీ పథకంలో రూ. 25 వేల కోట్లు తగ్గించారు. ఎరువులపై రూ. 35 వేల కోట్లు విధించారు. ప్రస్తుతం దేశంలో మెదడులేని సర్కారు ఉంది. ఈ దేశాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ దేశంలో గొప్పగా ఏం చేయలేదు, మోదీ ఏదో చేస్తారని ప్రజలు నమ్మి ఓటేసి మోసపోయారు’ అంటూ విమర్శలు గుప్పించారు.

కేసీఆర్‌ కేంద్రం తీరును విమర్శిస్తూ.. ‘కరోనా సమయంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గంగా నదిలో శవాలు తేలే పరిస్థితి తీసుకొచ్చిందీ ప్రభుత్వం. విద్యుత్‌ సంస్కరణలంటూ మెంటల్‌ కేసు పట్టుకున్నారు. రైతుల నుంచి విద్యుత్‌ ఛార్జీలు చేయాలన్నదే కేంద్రం అసలు వ్యూహం. ఘోరమైన పద్ధతిలో దేశాన్ని నాశనం చేస్తున్నారు. కరోనా లాంటి మహమ్మారి పీడించిన తర్వాత వైద్య రంగంపై బడ్జెట్‌ పెంచకపోవడం దారుణం. భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, నమ్మి ఓట్లు వేసిన ప్రజలను అమ్ముడు, మత పిచ్చి లేపుడు, దానితో రాజకీయ పగ్గం గడుపుకోవడమే లక్ష్యంగా భాజాపా రాజకీయం చేస్తోంది. వాళ్లే సిగ్గులేకుండా ఈ విషయాన్ని చెప్పుకుంటున్నారు. దేశ ఆస్తులు అమ్ముకుంటున్నారు. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో 101 స్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌ కంటే మనమే వెనకాల ఉన్నాం. ఇదీ మోదీ సర్కారు సాధించిన ఘనత. గ్లోబల్‌ ఇండెక్స్‌లో దేశం ర్యాంక్‌ దిగజారిందని దేశం ఘోషిస్తుంటే ఆహార సబ్సిడీని కూడా తగ్గించారు. బడ్జెట్‌లో కనీసం మద్ధతు ధర ప్రస్తావన లేదు, కరెంట్‌ మీటర్లు పెట్టబోమని చెప్పలేదు. ఇలాంటి బడ్జెట్‌ ఎందుకు.?

‘ఎయిరిండియాను అమ్మేశారు. అద్భుతమైన ఎల్‌ఐసీని అమ్ముతున్నామని ప్రకటించారు. అంత మంచి సంస్థను ఎందుకు అమ్మతున్నారు.? ఎవరి ప్రయోజనాల కోసం ఎల్‌ఐసీని అమ్ముతున్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది.? అన్ని రకాల ధరలు పెంచి రైతుల పెట్టుబడి రెట్టింపు చేశారు కానీ, ఆదాయం కాదు. అలా చేసి ఉంటే రైతులు ఎందుకు ఆందోళన చేశారు..? అందరికీ ఇళ్లు అని అందరినీ మోసం చేశారు. నల్ల ధనం తెచ్చి ప్రతీ ఇంటికి రూ. 15 లక్షలు ఇస్తామన్నారు ఇచ్చారా.? బ్లాక్‌ మనీని తేలేదు, బ్లాక్‌ మనీ సంపాదించిన వారికి దేశం నుంచి బయటకు పంపించారు’ అంటూ కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.