AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niranjan Reddy : తెలంగాణలో 2.40 కోట్ల మందికి జీవనాధారం.. రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రధాన రంగంగా గుర్తించాం : మంత్రి

వ్యవసాయరంగాన్ని బలోపేతం చేస్తే దాని అనుబంధ రంగాలు బలోపేతమై రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశ్యమని..

Niranjan Reddy  : తెలంగాణలో 2.40 కోట్ల మందికి జీవనాధారం..  రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రధాన రంగంగా గుర్తించాం : మంత్రి
Niranjan Reddy
Venkata Narayana
|

Updated on: Jun 01, 2021 | 2:03 PM

Share

Telangana Agriculture : వ్యవసాయ రంగాన్ని ప్రధాన రంగంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో 60 లక్షల రైతు కుటుంబాలు దాదాపు 2.40 కోట్ల జనాభా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని ఆయన తెలిపారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేస్తే దాని అనుబంధ రంగాలు బలోపేతమై రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశ్యమని మంత్రి వెల్లడించారు. దీనిలో భాగంగానే ఉచిత కరంటు, నీళ్లు, రైతుబంధు, రైతు బీమా, పంటల కొనుగోళ్లతో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణలో విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్ లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయం నుండి మంత్రి డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ కు కేంద్రం 767 గరిష్ట ధర ఖరారు చేసింది.. అంతకు మించి ఎక్కువ ధరకు అమ్మవద్దని మంత్రి తెలిపారు. వానాకాలంలో గ్లైఫోసైట్ అమ్మడాన్ని నిషేధించడం జరిగింది .. ఏ షాపులో కనిపించినా లైసెన్సులు రద్దు చేయండి అని మంత్రి పోలీసు, వ్యవసాయాధికారుల్ని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అదనపు డీజీ జితేందర్, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, సీడ్ టాస్క్ ఫోర్స్ ఐజీ నాగిరెడ్డి, ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు, డీఐజీలు, అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు తదితరులు ఈ డిజిటల్ సమావేశంలో పాల్గొన్నారు.

Read also : Sonu Sood : ‘నేను కాదు.. సోనూసూద్ సూపర్ హీరో’.. అతనికి థ్యాంక్స్ చెప్పమన్న కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ