Chandrababu: చంద్రబాబు నివాసం వద్ద అనుమానిత వ్యక్తి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలు విషయం తెలియడంతో…

హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు.

Chandrababu: చంద్రబాబు నివాసం వద్ద అనుమానిత వ్యక్తి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలు విషయం తెలియడంతో...
Suspected Person Arrested At Chandrababu House
Follow us
Balaraju Goud

| Edited By: Team Veegam

Updated on: May 10, 2021 | 10:19 AM

Suspected Person Arrested: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు. కడప జిల్లా రాజంపేట మండలం చక్రంపేట ప్రాంతానికి చెందిన సుబ్బారెడ్డి(40)ని ఆదివారం అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆయనను విచారించిన అనంతరం విడిచిపెట్టినట్లు వెల్లడించారు.

అయితే, తన వ్యక్తిగత సమస్యలను ప్రతిపక్షనేత దృష్టికి తీసుకువచ్చేందుకు వచ్చానని సుబ్బారెడ్డి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో.. తన తండ్రి, సవతి తల్లి, వారి కుమారుల నుంచి ప్రాణహాని ఉందని, ఈ విషయాన్ని మాజీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని రెండు రోజులుగా ఇక్కడ తిరుగుతున్నట్లు విచారణలో సుబ్బారెడ్డి చెప్పాడని పోలీసులు వెల్లడించారు. ఈ అంశాన్ని చంద్రబాబుకు సమాచారం ఇస్తామని పోలీసులు చెప్పినట్లు సమాచారం. ఆతని నుంచి వివరాలు నమోదు చేసుకొని సొంతూరికి పంపించినట్లు పోలీసులు తెలిపారు.

Read Also…  Former DGP Prasad Rao : మాజీ డీజీపీ ప్రసాద్ రావ్ గుండెపోటుతో మృతి.. పలువురి సంతాపం..