Hyderabad Road accident : హైదరాబాద్ బాలానగర్‌లో విచిత్ర రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో యువకుడు మృతి
వెనుక నుంచి ఏ వెహికలూ ఢీకొట్టలేదు. ముందు వాహనం సెడన్ బ్రేక్ కూడా వేయలేదు. కానీ విచిత్రంగా ఘోరమైన ప్రమాదం జరిగింది.
Hyderabad balanagar road accident : వెనుక నుంచి ఏ వెహికలూ ఢీకొట్టలేదు. ముందు వాహనం సెడన్ బ్రేక్ కూడా వేయలేదు. కానీ విచిత్రంగా ఘోరమైన ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే రోడ్డుకు మధ్యలో వెళ్తున్న బైక్ ఫ్లైఓవర్ సేఫ్టీ వాల్‌ను ఢీకొట్టింది. ఒంటిమీద ఎలాంటి గాయం కనిపించకుండానే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏపీలోని ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్.. లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. హైదరాబాద్ కెపిహెచ్‌బీలో ఉండే తన సోదరుడు ఇంటికి వచ్చిన అశోక్.. లైసెన్స్ తీసుకునేందుకు తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తున్నాడు.
అశోక్ వాహనం బాలానగర్ ఫ్లై ఓవర్ మీద రోడ్డు మధ్యలో వెళుతుండగా.. అతి వేగంగా వెళ్తూ ఎడమవైపు ఉండే సేఫ్టీ డివైడర్‌ను ఢీ కొట్టింది. స్థానికుల సాయంతో అశోక్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రాజధాని హైదరాబాద్ నగరంలో రోడ్ యాక్సిడెంట్లు కొంతకాలంగా చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. ముందు, వెనుక ఎవరూ ఢీకొట్టకుండానే ద్విచక్రవాహనాలపై వెళుతోన్న వాహనదారులు ప్రమాదానికి గురవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇలాఉండగా, హైదరాబాద్ లోని అన్ని రోడ్లపైనా జెఎన్‌టియు ఇంజనీరింగ్ విభాగం ఇటీవల ఒక పరిశోధన చేసింది. ఇందులో రాజధానిలోని180 కి పైగా రోడ్లలో రోడ్ డిజైనింగ్ జామెట్రీ లోపాలున్నాయని గుర్తించింది. ముఖ్యంగా మలుపులు.. జంక్షన్లు వెరీ డేంజర్ అని తేల్చింది. వీటితో జాగ్రత్త అని హెచ్చరిస్తోంది. రోడ్ డిజైనింగ్‌లో ఉన్న లోపాలు కూడా ఇందుకు ప్రధాన కారణమని పరిశోధనలు తేల్చాయి.