SC Railway: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్..సికింద్రాబాద్ -విశాఖ మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లు

South Central Railway: పండుగ సీజన్‌లో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రయాణీకులు..

SC Railway: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్..సికింద్రాబాద్ -విశాఖ మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లు
Railway Passenger Alert
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 30, 2021 | 3:22 PM

Indian Railways: పండుగ సీజన్‌లో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రయాణీకులు enquiry.indianrail.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి తెలుసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఆరు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ప్రత్యేక రైలు (నెం.08579) విశాఖపట్నం నుంచి నవంబరు 3,10,17 తేదీల్లో సాయంత్రం 7 గం.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే మరో ప్రత్యేక రైలు (నెం.02576) సికింద్రాబాద్ నుంచి నవంబరు 4,11,18 తేదీల్లో రాత్రి 7.40 గం.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.40 గం.లకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

అలాగే వివిధ మార్గాల్లో దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మరో ట్వీట్‌లో ప్రకటించింది.

Also Read..

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..

World Kickboxing Champion: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల అమ్మాయి.. ప్రపంచ ఛాంపియన్‌గా రెండోసారి ఎన్నిక..!

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే