World Kickboxing Champion: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల అమ్మాయి.. ప్రపంచ ఛాంపియన్‌గా రెండోసారి ఎన్నిక..!
Tajamul Islam: జమ్మూ కాశ్మీర్‌కు చెందిన తజ్ముల్ ఇస్లామ్ 8 ఏళ్ల వయసులో తొలిసారి కిక్ బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది.
World Kickboxing Champion: 13 ఏళ్ల తజ్ముల్ ఇస్లాం కిక్‌బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండోసారి బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. కైరోలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అండర్-14 విభాగంలో తంజుల్ ఈ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆమె అర్జెంటీనాకు చెందిన లాలినాను ఓడించడానికి ముందు ఆతిథ్య దేశానికి చెందిన ఇద్దరు దిగ్గజ బాక్సర్లను ఓడించింది.
విజయం తర్వాత తజ్ముల్ ట్వీట్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇది నాకు గర్వకారణమైన క్షణం అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. కైరోలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అండర్-14 విభాగంలో బంగారు పతకం సాధించాను. ఇప్పుడు రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాను అంటూ రాసుకొచ్చింది. దీనికి ముందు 2016 సంవత్సరంలో కేవలం 8 సంవత్సరాల వయస్సులో, ఆమె కిక్ బాక్సింగ్‌లో మొదటి ప్రపంచ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకుంది. అలా చేసిన మొదటి జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
తజ్ముల్ రెండో విజయం.. ఛాంపియన్‌షిప్ గురించి మాట్లాడుతూ, బండిపొరాలోని ఆర్మీ స్కూల్‌లో చదివిన తజ్ముల్ టీఓఐతో మాట్లాడుతూ, “ఛాంపియన్‌షిప్ అక్టోబర్ 18న ప్రారంభమై అక్టోబర్ 24న ముగిసింది. నేను నా ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 22న ఆడాను. ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి 30 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పాల్గొన్నారు. తజ్ముల్ విజయంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమెకు అభినందనలు తెలిపారు.
సొంత అకాడమీ.. తజ్ముల్ ఇస్లాం బందిపోరాలోని తార్కాపుర నివాసి. ఆమెకు నలుగురు తోబుట్టువులు. తజ్ముల్ తండ్రి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల తజ్ముల్ బందిపోరాలో తన సొంత అకాడమీని కూడా నడుపుతోంది. ఇతర బాలికలకు శిక్షణ ఇస్తుంది. రాష్ట్ర, జిల్లా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది. ఏడో తరగతి చదువుతున్న తజ్ముల్ ఆర్థోపెడిక్ సర్జన్ కావాలనే ఆశ ఉండేది. ఆమె మాట్లాడుతూ, ‘నేను ఆర్థోపెడిక్ డాక్టర్ కావాలనుకుంటున్నాను. తజ్ముల్ కాశ్మీర్‌లోని బేటీ బడావో, బేటీ బచావో బ్రాండ్ అంబాసిడర్ కూడా పనిచేస్తున్నాను. మా అమ్మ నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంది. కిక్ బాక్సింగ్ చేసేందుకు నాన్నను ఒప్పించింది’ అని తెలిపింది. తజ్ముల్ తండ్రి మాట్లాడుతూ.. తన కూతురు సాధించిన విజయాలకు గర్వంగా ఉందన్నారు.
Many congratulations to Tajamul Islam of Bandipora for scripting history in Cairo Egypt by winning the Gold medal at the World Kickboxing Championship 2021. Our young kickboxing champion has done exceptionally well over the years. pic.twitter.com/8dG5NCYKOq
— Office of LG J&K (@OfficeOfLGJandK) October 28, 2021
Also Read: Neeraj Chopra: చిన్నారితో నీరజ్ చోప్రా చిట్‌చాట్.. నాకు నువ్వు ఇష్టమన్న బాలిక.. వీడియో వైరల్
BWBBL: ఒంటరి పోరాటం చేసిన స్మృతి మంధాన.. అయినా ఓడిన సిడ్నీ థండర్..
Coca Cola: కొకకోలాకు రోనాల్డో ఝలక్ ఇస్తే.. వార్నర్ ఫన్ ఇచ్చాడు.. మ్యాటర్ ఏంటంటే..!