Coca Cola: కొకకోలాకు రోనాల్డో ఝలక్ ఇస్తే.. వార్నర్ ఫన్ ఇచ్చాడు.. మ్యాటర్ ఏంటంటే..!
Coca Cola: టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆడిన ప్రాక్టీస్ మ్యాచుల్లో విఫలమైనా, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
Coca Cola: టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆడిన ప్రాక్టీస్ మ్యాచుల్లో విఫలమైనా, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లో 10 ఫోర్లతో 65 పరుగులు చేసి, టీ20 కెరీర్‌లో 20వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 29, రోహిత్ శర్మ 26, బాబర్ ఆజమ్ 22 హాఫ్ సెంచరీల తర్వాత అత్యధిక అర్ధశతకాలు బాదిన ప్లేయర్‌గా వార్నర్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే శ్రీలంకతో మ్యాచ్ తరువాత మీడియాతో మాట్లాడిన వార్నర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘విమర్శకుల నోళ్లు మూయించగలమా.? అదైతే అస్సలు సాధ్యం కాదు. ఆటలో ఇవన్నీ సహజం. బాగా ఆడినపుడు ప్రశంసలు. అలా జరగని పక్షంలో విమర్శలు ఉంటాయి. అయితే, వీటన్నింటినీ పట్టించుకోకుండా.. ముఖంపై చిరునవ్వు చెదరనీయకకుండా పూర్తి విశ్వాసంతో ముందుకు సాగాలి. అదే ఆటగాడి లక్షణం.’’ అని చెప్పుకొచ్చాడు వార్నర్.
ఇక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భాగంగా వార్నర్ప్రవర్తించిన తీరు ఆసక్తికరంగా మారింది. యూరో ఛాంపియన్‌షిప్ ప్రెస్ మీట్ సందర్భంగా పోర్చుగల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్లను పక్కకుపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వార్నర్ సైతం ఇదే తరహాలో వ్యవహరించాడు. వీటిని పక్కకు పెట్టవచ్చా.? అంటూ తన ముందున్న కోకా కోలా బాటిళ్లను తీసి కిందపెట్టాడు. అంతలోనే ఓ వ్యక్తి వచ్చి.. బాటిళ్లను టేబుల్ మీద పెట్టాల్సిందిగా సూచించాడు. ఇందుకు నవ్వుతూ సమాధానమిచ్చిన వార్నర్… ఓహో అక్కడే పెట్టాలా.. సరే అంటూ స్మైల్ ఇచ్చాడు. ఆ తర్వాత.. ఒకవేళ క్రిస్టియానోకు ఇది మంచిదైతే.. నాకు కూడా మంచిదే అంటూ చమత్కరించాడు. దీంతో అక్కడ రిపోర్టర్లు ఒక్కసారిగా నవ్వుకున్నారు.
David Warner tries to do a Cristiano Ronaldo at presser, told to put Coca Cola bottles back . . .#DavidWarner #CristianoRonaldo #cocacola pic.twitter.com/Y2MuxPs07m
— RED CACHE (@redcachenet) October 28, 2021
Also read:
Digital Gold: డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. పూర్తి వివరాలు మీకోసం..