Julian Assange: అమెరికాకు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకోవచ్చు.. జూలియన్ అసాంజే కేసులో లాయర్ సంచలన కామెంట్స్..
Julian Assange: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించే విషయమై బ్రిటన్ హైకోర్టులో తాజాగా
Julian Assange: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించే విషయమై బ్రిటన్ హైకోర్టులో తాజాగా వాడీవేడీ వాదనలు జరిగాయి. ఆయన్ను అమెరికాకు అప్పగించవద్దని, అక్కడి పరిస్థితులు తాళలేక ఆయన ఆత్మహత్య చేసుకునే ముప్పు తీవ్రంగా ఉందని అసాంజే తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే.. సుమారు పదేళ్ల కిందట అమెరికా సైన్యానికి చెందిన రహస్య పత్రాలను బహిర్గతం చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో ఆయన గూఢచర్యానికి పాల్పడ్డారంటూ అగ్రరాజ్యంలో కేసు నమోదైంది. ఇందులో నమోదైన ఆరోపణలు రుజువైతే, అసాంజేకు 175 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది! ఈ క్రమంలో, అసాంజేను తమకు అప్పగించాలని అమెరికా కోరుతోంది.
Also read:
Digital Gold: డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. పూర్తి వివరాలు మీకోసం..
Viral News: ఫోన్‌లో ఆడుతూ ఊహించని పని చేసిన చిన్నారి.. అది చూసి షాక్ అయిన తల్లింద్రుడులు..