AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Gold: డిజిటల్‌ రూపంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. పూర్తి వివరాలు మీకోసం..

Digital Gold: భారత్‌లో బంగారానికి ఏ రేంజ్‌లో డిమాండ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. బంగారు ఆభరణాలను ధరించడం కోసం కొనుగోలు చేయడంతో పాటు..

Digital Gold: డిజిటల్‌ రూపంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. పూర్తి వివరాలు మీకోసం..
Digital Gold
Shiva Prajapati
|

Updated on: Oct 30, 2021 | 10:12 AM

Share

Digital Gold: భారత్‌లో బంగారానికి ఏ రేంజ్‌లో డిమాండ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. బంగారు ఆభరణాలను ధరించడం కోసం కొనుగోలు చేయడంతో పాటు.. పెట్టుబడుల పరంగానూ బంగారంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డిజిటల్ రూపంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువ అవుతున్నాయి. డిజిటల్ రూపంలో బంగారం కొనుగోళ్లు అంటే.. అంటే థర్డ్‌ పార్టీ లేదా విక్రేత మన బంగారాన్ని భద్రపరచడం అన్నమాట. బంగారానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టడానికి మన ముందు చాలా రకాల విధానాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌లు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్లతో పాటు భౌతికంగా బిస్కెట్లు, నాణేలు, ఆభరణాలు కొని ఇంట్లో పెట్టుకోవడం, బ్యాంకు లాకర్లలో భద్ర పరచుకోవడమూ చేయొచ్చు. అయితే డిజిటల్‌ గోల్డ్‌పై దాదాపు ఎటువంటి ఆంక్షలు కానీ, నియంత్రణ కానీ లేదనే చెప్పాలి. కానీ, మోసాలకూ అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి డిజిటల్‌ పసిడి పెట్టుబడుల విషయంలో కొన్ని అంశాలను మదుపర్లు తప్పక గమనించాలి. పాటించాలి. మరి ఈ డిజిటల్ బంగారం కొనుగోళ్లకు ఏంటి? వాటి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డిజిటల్‌ గోల్డ్‌ విషయంలో సర్వీస్ ప్రొవైడర్లు మనకు సహాయం చేస్తారు. అంటే మనకు బదులుగా మన బంగారాన్ని వాల్ట్‌లో ఉంచుతారన్నమాట. అయితే సర్వీసు ప్రొవైడర్‌ను ఎంచుకునే ముందు వారికి విశ్వసనీయత ఉందో లేదో చూడాలి. భాగస్వామ్య సంస్థలు, మాతృసంస్థలు, ఆ కంపెనీకి నిధులు ఇస్తున్న సంస్థల పూర్వాపరాలు చూసి సంతృప్తి చెందాకే ముందడుగు వేయాలి. సర్వీసు ప్రొవైడరుకు మనకు మధ్య మధ్యవర్తిత్వ సంస్థలూ ఉంటాయి. పేమెంట్‌ వాలెట్‌ లేదా బ్యాంకులు కూడా పసిడిని మనకు అందిస్తాయి. ఇవి ఆర్‌బీఐ నియంత్రణలో పనిచేసేవి కాబట్టి వినియోగదార్లకు థర్డ్‌పార్టీ ఉత్పత్తిని అందించే ముందు గట్టి పరిశీలన చేస్తాయి. కాబట్టి నమ్మకానికి భరోసా ఉంటుంది. సర్వీసు ప్రొవైడరుపై విశ్వాసం ఉంటే తప్ప మార్కెట్‌ ఇంటర్మీడియటరీ ద్వారా కొనుగోలు చేయడమే శ్రేయస్కరం.

Also read:

Badvel By Election: భాజపా ఏజెంట్లను ఇబ్బంది పెడుతున్నారు.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు ..

Kachidi Fish: ఒక్క చేపతో వారి సుడి తిరిగింది.. ఎంతకు అమ్మారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

New Rules from November : బ్యాంకుల రూల్స్ నుంచి గ్యాస్ వరకూ నవంబర్ ఒకటో తేదీ నుంచి వచ్చే మార్పులు ఇవే..గమనించండి!