Dinosaur Speech: ఇప్పటికైనా మారండి.. లేకపోతే మాలాగే అంతరించిపోతారు.. యూఎన్ సదస్సులో డైనోసార్ ఉద్భోద.. Viral Video
Dinosaur Speech in UN Meet: ఐక్యరాజ్యసమితి సమావేశ మందిరంలో అంతర్జాతీయ ప్రతినిధులతో సదస్సు జరుగుతోంది. దీంతో అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో క్రూరమైన

Dinosaur Speech in UN Meet: ఐక్యరాజ్యసమితి సమావేశ మందిరంలో అంతర్జాతీయ ప్రతినిధులతో సదస్సు జరుగుతోంది. దీంతో అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో క్రూరమైన ఓ డైనోసార్ అక్కడికి చేరుకుంది. దీంతో యూఎన్ ప్రతినిధులంతా ఒక్కసారిగా భయపడ్డారు. ఉలిక్కిపడుతూ కేకలు వేశారు. ఈ క్రమంలో డైనోసార్ నేరుగా సభా వేదిక వద్దకు వెళ్లింది. మైకును సరి చేసి గొంతును సవరించుకుంది. ప్రజలరా ఇది వినండి అంటూ.. డైనోసార్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టింది. డైనోసార్ ఏంటీ.. ప్రసంగించడం ఏంటీ అనుకుంటున్నారా..? ఇదంతా నిజంగానే జరిగింది. వాతావరణం, పర్యావరణ మార్పులపై తాజాగా ఐక్యరాజ్యసమితి వినూత్న సందేశం ఇప్పించింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) గ్రాఫిక్ డైనోసార్‌తో ప్రసంగం ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఐక్యరాజ్యసమితి 193 మంది సభ్యుల జనరల్ అసెంబ్లీలో దౌత్యవేత్తలు కూర్చొని ఉండగా.. కావెర్నస్ హాల్‌లోకి చేరుకుని ప్రసంగాన్ని మొదలుపెడుతుంది. వాతావరణ విపత్తుల నుంచి ప్రజలను రక్షించాలని.. ఆలస్యం కాకముందే మేలుకోవాలంటూ ఉద్బోధించింది. రోజురోజుకూ పెరుగుతున్న భూతాపం నుంచి ప్రజలను రక్షించాలని కోరింది. మనం వాడే శిలాజ ఇంధనాలతో కర్బన ఉద్గారాలు గాల్లో కలిసి వాతావరణం వేడెక్కుతోంది. దీంతో పర్యావరణ ఇబ్బందులు తలెత్తడంతోపాటు.. విపత్తులు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన ఉద్ఘారాలను తగ్గించి ఉష్ణోగ్రతలు పెరగకుండా ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు దిశానిర్ధేశం చేసింది. దీనిలో భాగంగా పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి వినూత్న సందేశం ఇప్పించింది. అంతరించిపోయిన డైనోసార్లతో.. భూమి మీద ప్రజలు కూడా అంతరించిపోతారని హెచ్చరికలు చేసింది.
డైనోసార వచ్చిరాగానే ‘ప్రజలారా వినండి’ అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టింది. మీరంతా పర్యావరణ విపత్తు దిశగా అడుగులేస్తున్నారంటూ పేర్కొన్నారు. పెద్ద పెద్ద ఉల్కలపై అంతే మొత్తాన్ని మనం ఖర్చు చేస్తున్నామనుకోండి.. ఏమవుతుంది.. ఇప్పుడు మీరు చేస్తున్నది అదేనంటూ హెచ్చరించింది. ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు.. లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని శిలాజ ఇంధనాల సబ్సిడీ కోసం.. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నాయి. ఏటా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది పేదరికంలో మగ్గుతున్నారు.. ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా వినాశనంపై ఖర్చు చేయడానికి బదులు.. పేదలకు సాయం చేస్తే బాగుంటుందని ఎప్పుడూ అనిపించలేదా? మీ అంతం కోసం మీరే డబ్బులు ఖర్చు చేసుకుంటారా? అంటూ ప్రశ్నించింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ప్రణాళికలు, చర్యలు తీసుకోండి. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మీ ఆర్థిక వ్యవస్థలను పటిష్టం చేసుకుంటున్నారు.
వీడియో..
ఈ తరుణంలో నేను మీకిచ్చే సలహా ఇదే.. మీ అంతాన్ని మీరే కోరుకోకండి. సమయం మించిపోకముందే మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. మార్పులను స్వాగతించండి.. మారండి. దాని నుంచి తప్పుకునేందుకు ఏవేవో కారణాలు చెప్పొద్దు.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.. అంటూ గ్రాఫిక్ డైనోసార్ తన ప్రసంగాన్ని ముగించింది. దీంతో యూఎన్ సమావేశ మందిరం కరతాళధ్వనులతో మార్మోగింది.
Also Read: