T20 World Cup 2021: మ్యాచ్‎ను మలుపు తిప్పిన ఓవర్.. ఒకే ఓవర్‎లో 4 సిక్సర్లు.. వీడియో వైరల్..

టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా శుక్రవారం పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్‎లో పాక్ ఆటగాడు ఒకే ఓవర్‎లో 4 సిక్స్‎లు కొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చాడు. 12 బంతుల్లో పాక్ 24 పరుగులు అవసరం ఉన్నాయి. అప్పుడు క్రీజ్‎లో ఆసిఫ్ అలీ, షాదబ్ ఖాన్ ఉన్నారు...

T20 World Cup 2021: మ్యాచ్‎ను మలుపు తిప్పిన ఓవర్.. ఒకే ఓవర్‎లో 4 సిక్సర్లు.. వీడియో వైరల్..
Asif
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 30, 2021 | 11:31 AM

టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా శుక్రవారం పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్‎లో పాక్ ఆటగాడు ఒకే ఓవర్‎లో 4 సిక్స్‎లు కొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చాడు. 12 బంతుల్లో పాక్ 24 పరుగులు అవసరం ఉన్నాయి. అప్పుడు క్రీజ్‎లో ఆసిఫ్ అలీ, షాదబ్ ఖాన్ ఉన్నారు. పాక్ గెలుపు కాస్త కష్టమే అనుకున్నారంతా.. కానీ ఆసిఫ్ అలీ మ్యాచ్ గతినే మార్చేశాడు. ఆఫ్ఘాన్ బౌలర్ కరీం జనత్ వేసిన వేసిన 18వ ఓవర్‎లో ఆసిఫ్ అలీ నాలుగు సిక్స్‎లు కొట్టాడు. ఫస్ట్ బాల్‎ను సిక్స్ కొట్టాడు. తర్వాత మూడో బంతికి కూడా సిక్స్ బాదాడు. ఐదు, ఆరో బాల్‎ను బౌండరీ అవతలికి తరలించి పాక్‎కు విజయాన్ని అందించాడు ఆసిఫ్ అలీ. అలీ ఏడు బంతుల్లో 25 పరుగులు చేశాడు.

View this post on Instagram

A post shared by ICC (@icc)

అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. మ్యాచ్‌ ప్రారంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా తర్వాత కెప్టెన్‌ మహమ్మద్ నబీ (35), గుల్బదిన్ నయిబ్ (35) ధాటిగా ఆడడంతో ఆఫ్ఘాన్‌ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. అస్ఘర్‌ అఫ్గాన్‌ (10), రహ్మానుల్లా గుర్బాజ్‌ (10), కరీమ్‌ జనత్‌ (15) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. చివరి 3 ఓవర్లలో 43 పరుగులు రాబట్టింది ఆఫ్ఘాన్‌ టీమ్‌. ఇక పాక్‌ బౌలర్లలో ఇమాద్‌ వసీమ్‌ రెండు, షహీన్ అఫ్రిది, హ్యారిస్‌ రవూఫ్‌, హాసన్‌ అలీ, షాదాబ్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు. 148 పరుగుల లక్ష్యాన్ని పాక్ సునాయాసంగా ఛేదించింది.

పాక్‌ బ్యాట్స్‌మెన్స్‌లో బాబార్‌ అజమ్‌ 51 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో రాణించాడు. ఇక జమాన్‌ కూడా 25 బంతుల్లో 30 పరుగులు సాధించి స్కోర్‌ బోర్డు వేగాన్ని పెంచాడు. చివర్లో ఆసిఫ్ రాణించడంతో పాక్ గెలిచింది. ఈ విజయంతో పాక్ వరుసగా మూడు మ్యాచ్‎ల్లో గెలుపొంది, గ్రూప్-2లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆఫ్ఘానిస్తాన్ రెండో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, భారత్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.

Read Also.. T20 World Cup 2021: టీం ఇండియా బీచ్ వాలీబాల్.. వైరల్‎గా మారిన వీడియో..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే