BWBBL: ఒంటరి పోరాటం చేసిన స్మృతి మంధాన.. అయినా ఓడిన సిడ్నీ థండర్..
ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యుబీబీఎల్)లో స్మృతి మంధాన 44 బంతుల్లో 64 పరుగులు చేసి రాణించింది. మంధాన నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్ కొట్టింది. కానీ ఆమె జట్టును గెలిపించలేకపోయింది....
ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యుబీబీఎల్)లో స్మృతి మంధాన 44 బంతుల్లో 64 పరుగులు చేసి రాణించింది. మంధాన నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్ కొట్టింది. కానీ ఆమె జట్టును గెలిపించలేకపోయింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ సిడ్నీ థండర్‌ను ఓడించింది. యూనివర్శిటీ ఆఫ్ టాస్మానియా (UTAS) స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెనెగేడ్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రోడ్రిగ్స్, జోసెఫిన్ డూలీ అద్భుతమైన ప్రారంభాన్ని అందించారు. మొదటి వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
మరో ఎండ్‌లో వికెట్లు పడడంతో రోడ్రిగ్స్ 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. రెనెగేడ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి142 పరుగులు చేసింది. 143 పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన సిడ్నీ థండర్ 20 ఓవర్లలో 8 వికెట్ల్ కోల్పోయి 133 పరుగులే చేసింది. దీంతో 9 పరుగుల తేడాతో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ గెలిచింది. థండర్ జట్టులో మంధాన అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. డిఫెండింగ్ ఛాంపియన్ సిడ్నీ థండర్ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. వారు వరుసగా ఐదు మ్యాచ్‌లో ఓడిపోయారు. రెనెగేడ్స్ బౌలర్లల్లో కోర్ట్నీ వెబ్ 3 వికెట్లు తీసింది.
ఈ మ్యాచ్‌లో మరో ఇద్దరు భారత క్రీడాకారిణులు టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెనెగేడ్స్ తరఫున, ఆల్ రౌండర్ దీప్తి శర్మ థండర్ తరఫున ఆడారు. హర్మన్‌ప్రీత్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసింది. దీప్తి కేవలం 10 బంతుల్లో 23 పరుగులు చేసి ఒక వికెట్ కూడా తీసి రాణించింది. ఈ విజయంతో రెనెగేడ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా, థండర్ అట్టడుగున కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌లు శనివారం మెల్‌బోర్న్ స్టార్స్‌తో తలపడగా, రెనెగేడ్స్ సిడ్నీ సిక్సర్‌తో తలపడనుంది.
Read Also.. T20 World Cup 2021: మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఓవర్.. ఒకే ఓవర్లో 4 సిక్సర్లు.. వీడియో వైరల్..