AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. హైదరాబాద్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ ప్లాంట్.. నేడు ప్రారంభించనున్న కేటీఆర్‌

తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. 1200 కోట్ల రూపాయలతో ఓ యూనిట్‌ ఏర్పాటుకు ప్రీమియర్ ఎనర్జీస్ అంగీకరించింది. సౌర విద్యుదుత్పత్తి..

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. హైదరాబాద్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ ప్లాంట్.. నేడు ప్రారంభించనున్న కేటీఆర్‌
Subhash Goud
|

Updated on: Jul 29, 2021 | 6:02 AM

Share

తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. 1200 కోట్ల రూపాయలతో ఓ యూనిట్‌ ఏర్పాటుకు ప్రీమియర్ ఎనర్జీస్ అంగీకరించింది. సౌర విద్యుదుత్పత్తి పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్‌ ఎనర్జీస్‌.. హైదరాబాద్‌లో కొత్త ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఈ ప్లాంట్‌ గురువారం (నేడు) ప్రారంభించనుంది. సుమారు రూ. 483 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

దీంతో పాటు విస్తరణ ప్రాజెక్టు కూడా హైదరాబాద్‌లో ఉండనుందని, ఇందుకుగాను మరో రూ. 1,200 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు సంస్థ వెల్లడించింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ యూనిట్ 750 మెగావాట్ల సోలార్‌ సెల్స్‌, 750 మెగావాట్ల సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్లాంటులో ఎంసీసీఈ టెక్చర్డ్‌ మల్టీ-క్రిస్టల్లీన్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌, మోనో పీఈఆర్‌సీ సెల్స్‌, మాడ్యూల్స్‌, పాలీక్రిస్టల్లీన్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌ ఉత్పత్తి కానున్నాయి. రూ. 1,200 కోట్ల పెట్టుబడులతో వచ్చే రెండేళ్ళలో ఉత్పాదక సామర్థ్యాన్ని 3 గిగావాట్లకు విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. రానున్న నాలుగు నెలల్లోనే రూ. 500 కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్‌ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు సంస్థ వివరించింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 500 కోట్లు పెట్టుబడి పెడుతామని, మొత్తంమీద వచ్చే రెండేండ్లలో రూ. 1,000-1,200 కోట్ల వరకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది.

కాగా, కంపెనీ 1995లో స్థాపించారు సురేందర్ పాల్ సింగ్ వ్యవస్థాపకుడు. వెయ్యి మంది ఉద్యోగులు ఉన్న కంపెనీ.. సోలార్ మాడ్యూల్స్ ఉత్పత్తిలో ఉంది. రూఫ్ టాప్, గ్రౌండ్ మౌంటెడ్, వాటర్ పంప్స్ విభాగంలో ఉత్పత్తి చేస్తోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం లక్ష చదరపు అడుగుల స్థలంలో యూనిట్ ఉంది. భారత్ లోని వివిధ సంస్ధలతో పాటు.. ఏసియా, యూరోప్, ఆఫ్రికాలోని 30దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ రూ.850 కోట్ల టర్నొవర్ సాధించింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం రూ.1500 కోట్లు సాధిస్తామంటోంది.

ఇవీ కూడా చదవండి

Etela Rajender: రాబోయే కాలంలో పేదరికాన్ని నిర్మూలించి ఉద్యోగాలకు ప్రణాళికలు రూపొందిస్తాం: ఈటల రాజేందర్‌

Cyberabad Police: మందుబాబులకు ఊహించని షాక్ ఇచ్చిన సైబరాబాద్ పోలీసులు.. 353 మందికి జైలు శిక్ష..

Follow Us
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్