న భయం.. న లజ్జ.. ఒకడి టార్గెట్ 100.. మరొకడి టార్గెట్ 300.. మతి తప్పిన మదపిచ్చోళ్లు..
వందమంది అమ్మాయిలే నా టార్గెట్ అంటాడొకడు. ట్రిపుల్ సెంచరీ కొట్టాకే విశ్రమిస్తానంటాడు ఇంకొకడు. అపరిచితుడి వేషం కట్టి నమ్మించి అమ్మాయిల మానప్రాణాల్ని పణంగా పెట్టి కోట్లు కొల్లగొడతాడు ఇంకొకడు. వయసు మళ్లిన ముసలావిడ మీద కూడా అఘాయిత్యానికి పాల్పడతాడు మరొకడు. పశువుల్ని కూడా వదిలిపెట్టనంత క్రూరంగా ఘోరంగా మతి తప్పి మదపిచ్చి పట్టి ఊరుమీద పడే తోడేళ్ల కథలు ఎన్నంటే ఏం చెప్పగలం..?

కామాతురాణాం నభయం నలజ్జ.. కామంతో కళ్లు మూసుకుపోయినవాడికి సిగ్గూ భయం రెండూ ఉండవు. మరి.. సమాజం పట్ల బాధ్యత ఉంటుందని ఎలా అనుకుంటాం.. ఎందుకు ఆశిస్తాం…? అక్షరం ముక్క రానివాడైనా.. మాస్టర్స్ డిగ్రీ చదివినవాడైనా.. అందరిదీ అదే బాపతు. ఎవ్వరికీ కనీస ఇంగితం లేదు. చట్టాలంటే భయం లేదు. ప్రస్తుతానికి తెలుగురాష్ట్రాల్లో ఓ నలుగురు కామోన్మాదులపై ఇంట్రస్టింగ్ టాక్ నడుస్తోంది. మతితప్పి, మదమెక్కిన కామ పిశాచుల స్వైరవిహారం సమాజంలో ఏ రేంజ్‌లో నడుస్తోందో తెలుస్తోంది. వందమంది అమ్మాయిలే నా టార్గెట్ అంటాడొకడు.. ట్రిపుల్ సెంచరీ కొట్టాకే విశ్రమిస్తానంటాడు ఇంకొకడు.. అపరిచితుడి వేషం కట్టి నమ్మించి అమ్మాయిల మానప్రాణాల్ని పణంగా పెట్టి కోట్లు కొల్లగొడతాడు ఇంకొకడు.. వయసు మళ్లిన ముసలోళ్ల మీద కూడా అఘాయిత్యానికి పాల్పడతాడు మరొకడు.. పశువుల్ని కూడా వదిలిపెట్టనంత క్రూరంగా ఘోరంగా మతి తప్పి మదపిచ్చి పట్టి.. ఊరుమీద పడే తోడేళ్ల కథలు ఎన్నంటే ఏం చెప్పగలం..? ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కామపిశాచులు రెచ్చిపోతున్నారు.. మగాళ్ల ముసుగుతన్ని.. ఆడపిల్లల పాలిట తోడేళ్లుగా మారుతున్న వైల్డ్ ఎనిమల్స్ మన సమాజంలో మన మధ్యనే మన చుట్టూనే యదేఛ్చగా తిరుగుతున్నారు. ఒక్కటొక్కటిగా బైటికొస్తున్న క్రైమ్ కహానీలు.. వాటి మాటున నక్కి ఉండే కామాంధుల కథలు.. నైతికంగా మనమెక్కడున్నామో నిగ్గదీసి అడిగేస్తున్నాయి. ఇటీవల తెలుగురాష్ట్రాల్లో వెలుగుచూసిన కొన్ని నికృష్టమైన ఉదంతాలు.. సమాజాన్ని చీడపురుగులు ఎంత పట్టిపీడిస్తున్నాయో అర్థమౌతోంది. బత్తుల ప్రభాకర్.. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్.. బత్తుల ప్రభాకర్.. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్… 80కి పైగా...




