AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంత పార్టీలోనే సెగ.. రేవంత్‌పై సీనియర్ల ఫైర్..!

పని చేస్తే ప్రజా ప్రయోజనం ఉండాలి. కనీసం పార్టీకైనా ఉపయోగపడాలి. ఈ రెండూలేకుండా.. నేనో లీడర్‌.. నాదో స్టయిల్ అంటే మాత్రం ఏ పార్టీ అయినా ఎందుకు సహిస్తుంది.

సొంత పార్టీలోనే సెగ.. రేవంత్‌పై సీనియర్ల ఫైర్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 12, 2020 | 6:18 PM

Share

పని చేస్తే ప్రజా ప్రయోజనం ఉండాలి. కనీసం పార్టీకైనా ఉపయోగపడాలి. ఈ రెండూలేకుండా.. నేనో లీడర్‌.. నాదో స్టయిల్ అంటే మాత్రం ఏ పార్టీ అయినా ఎందుకు సహిస్తుంది. రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఇప్పుడిదే జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌ హోదాలో ఉండి.. పర్సనల్‌ అజెండానే వర్క్‌గా మార్చుకున్న ఆయనకు సీనియర్ల నుంచి ఈసడింపు తప్పడం లేదు. నింద అయితే నిరూపించుకో.. తప్పయితే సరిదిద్దుకో అని పదేపదే చెబుతున్నా.. పట్టించుకోని రేవంత్‌ సీన్‌ని ఇప్పుడు పార్టీ పెద్దల ముందుకు తీసుకొస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు.

తెలంగాణలో కాంగ్రెస్ అసలే కష్టాల్లో ఉంది. ఎన్నికలు ఏవైనా గెలుపు పాచిక.. ఒక్కటీ పారడంలేదు. ఈ పరిస్థితుల్లో పార్టీని ధీటుగా ముందుకెలా తీసుకెళ్లాలన్న అంతర్మథనం ఒక్కోనేతలో ఎక్కువవుతోంది. ఇలాంటి పరిస్థితిల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి ఏం చేయాలి.. ! వీలుంటే నాలుగు మంచి ప్రయత్నాలు, కుదిరితే కొత్త వ్యూహాలు అమలు చేయాలి. కానీ, అందుకు భిన్నంగా ఉంది తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీరు. ఈ మాట ఎవరిదో కాదు.. ఏకంగా కాంగ్రెస్ సీనియర్లేదే..

రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలో కోట్ల విలువ చేసే భూముల కబ్జా వ్యవహారంలో బాధితులు రేవంత్‌కు వ్యతిరేకంగా క్యూ కట్టారు. దర్యాప్తులో రేవంత్‌, అతని సోదరుడు కొండల్‌.. కబ్జా బ్రదర్సే అని దాదాపు తేలిపోయింది. ఒకవేళ అది అబద్దమైతే నిరూపించుకునే న్యాయపరమైన మార్గాలు అనేకం ఉన్నా.. పసలేని నిందలనే పనిగా పెట్టుకున్నారు రేవంత్. అవి తప్పును కప్పిపుచ్చుకునే డ్రామాలు అని ఆ పార్టీ నేతలే అంటున్నారంటే… రేవంత్ తీరెలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నోరుంది కదా అని విమర్శలు.. అందుబాటులో డ్రోనుంది కదా అని ఏవో చేతలకు దిగితే ఎలా బూమరాంగ్ అవుతుందో కూడా రేవంత్ చర్యలతో మరోసారి రుజువైంది. ఎలాంటి పర్మిషన్ లేకుండా.. కేటీఆర్‌ లీజుకు తీసుకున్న ఫామ్‌హౌస్‌పై డ్రోన్‌ ఎగరవేసి నానాయాగీ చేశారు రేవంత్‌. కట్‌ చేస్తే.. ఆ తప్పుకు చర్లపల్లి జైలుపాలయ్యారు. బెయిల్‌ కోసం శతవిధాలా ప్రయత్నించినా.. మళ్లీ జైలేకు పంపింది కోర్టు.

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంటే.. విభిన్నరకాల ఆలోచనలు, వాటిని వ్యక్తం చేసే పార్టీ పరమైన స్వేచ్ఛ అంటుంది కాంగ్రెస్‌. కానీ.. సొంత అజెండాను పార్టీ జెండాకు అంటించి, అదే సిద్ధాంతం, అదే నినాదం అని రెచ్చిపోతే.. అసలుకే ఎసరొస్తుందన్నది సీనియర్ల మాట. సోషల్ మీడియాలో సొంత డబ్బా కొట్టుకోవడం, జైలుకెళ్లాం కాబట్టి పదవులు వస్తాయని భ్రమలో ఉండడం రేవంత్‌కు అలవాటైపోయిందన్న వాదన కూడా పార్టీ సీనియర్లు వినిపిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే..! 111 జీవోను – కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ను తెరపైకి తెచ్చి రేవంత్‌ చేస్తున్న రచ్చతో కాంగ్రెస్‌ అవాక్కవవ్వడం. ఎందుకంటే.. ఆ జీవో పరిధిలో ఎక్కువగా ఉన్న బిల్డింగ్‌లు కాంగ్రెస్ నేతలవేనట. కనీసం పార్టీలో చర్చించకుండా రేవంత్ సొంత అజెండా అప్లై చేయడం కాంగ్రెస్‌కే పెద్ద లాస్ అంటున్నారు సీనియర్లు.

చూడబోతే.. రేవంత్‌ తీరుతో పార్టీకి కోలుకోలేని నష్టమన్న రియలైజేషన్‌లోకి కాంగ్రెస్ సీనియర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఆయన్ని అంతటితో వదిలేయకుండా కోర్‌ కమిటీలో చర్చించి.. వైద్యం చేయించాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు వాళ్లు. మొత్తంగా.. మొన్న దామోదర రాజనర్సింహ, నిన్న జగ్గారెడ్డి, ఇవాళ వీహెచ్‌.. ఇలా వరసబెట్టి సీనియర్లు రేవంత్‌ తీరును వ్యతిరేకిస్తూ రెస్పాండ్ అవుతున్నారు. ఇక వాళ్ల డిమాండ్‌ విని.. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్‌ కుంతియా లాంటి వాళ్లు స్పందించడమే మిగిలింది.

Read This Story Also: పొగడ్తలపై ‘చిరు’ కామెంట్లు.. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు..!