Secundrabad Fire: డెక్కన్ మాల్‌లోకి డ్రోన్ కెమెరా.. బిల్డింగ్ వెనుక వెైపున రెండు డెడ్‌బాడీలు ఎవరివంటే..
ప్రతీ ఫ్లోర్‌ను డ్రోన్ కెమెరాతో షూట్ చేశారు. ఆ దృశ్యాలను నిశితంగా పరిశీలించారు అధికారులు. ఈ క్రమంలోనే రెండు డెడ్‌బాడీలు బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉన్నట్టు ఐడెంటిపై చేశారు.

డెక్కన్ మాల్‌లో డ్రోన్ కెమెరా ఎఫర్ట్స్ ఫలితాలనిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం ఇద్దరి మృతదేహాలను గుర్తించారు అధికారులు. బిల్డింగ్ వెనుక వెైపున రెండు డెడ్‌బాడీస్ పడి ఉన్నాయి. మొత్తం ముగ్గురు అదృశ్యం కాగా ఇద్దరి మృతదేహాలను మాత్రం ప్రస్తుతానికి గుర్తించారు. గంటల తరబడి మంటల ధాటికి బిల్డింగ్ మొత్తం హీటెక్కింది. లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో డ్రోన్ కెమెరాలను బిల్డింగ్‌లోకి పంపించారు అధికారులు. ప్రతీ ఫ్లోర్‌ను డ్రోన్ కెమెరాతో షూట్ చేశారు. ఆ దృశ్యాలను నిశితంగా పరిశీలించారు అధికారులు. ఈ క్రమంలోనే రెండు డెడ్‌బాడీలు బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉన్నట్టు ఐడెంటిపై చేశారు. ఈ ప్రమాదంపై ఎనీటైమ్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ అమోయ్ కుమార్. మరో నాలుగైదు గంటలు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందని చెప్పారు.
అయితే, సికింద్రాబాద్ డెక్కన్ మాల్ బిల్డింగ్ అగ్ని ప్రమాదంలో వసీం, జునైద్, జహీర్ ముగ్గురు సజీవ దహనం అయ్యారు. వారిని బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. బిల్డింగ్ దగ్గరకు వచ్చిన యజమాని రహీం.. ప్రమాదం గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. యజమానిని లోపలికి తీసుకెళ్లిన పోలీసులు.. బిల్డింగ్ పైకి వెళ్లేందుకు ఉన్న దారులపై ఆరా తీశారు. భవనం యజమాని మహ్మద్, రహీంలపై కేసు నమోదు చేశారు.
డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేతపై మల్లగుల్లాలు పడుతున్నారు అధికారులు. బిల్డింగ్ కూల్చివేత అంత సులభం కాదంటున్నారు వాళ్లు. 10 గంటల పాటు మంటల్లో ఉన్న బిల్డింగ్ కూల్చివేత ప్రమాదం అంటున్నారు అధికారులు.
ఒకేసారి భవనం నేలమట్టం చేస్తే పక్క బిల్డింగ్‌లు ధ్వంసమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంజనీరింగ్ సవాల్‌గా మారిన డెక్కన్ మాల్ కూల్చివేత పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంటల సెగకు పక్క బిల్డింగ్‌లు వీక్ అయ్యాయి.
ఎల్ ఆకారంలో డెక్కన్ మాల్ భవనం ఉంది. దాన్ని కూల్చాలంటే మధ్యలో ఉన్న వాటినీ కూల్చే ఆలోచన చేస్తున్నారు అధికారులు. క్రేన్‌తో వాటిని కూల్చాలా లేక మరో పని చేయాలా అని అంచనా వేస్తున్నారు.
డెక్కన్‌మాల్ ప్రమాదంలో గాయపడ్డ ఫైర్ ఆఫీసర్ పరిస్థితి విషమంగా ఉంది. మంటలను ఆర్పే క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు ధనుంజయ రెడ్డి, ఫైర్ వెహికల్ డ్రైవర్ నర్సింగ్‌రావు. వారిప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం