Summer Special Trains: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లు

Railway Passenger Alert: సమ్మర్ సీజన్ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు లబ్ధి చేకూరేలా పలు ప్రత్యేక రైళ్లను ఇది వరకే ప్రకటించింది. తాజాగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. కాచిగూడ - కాకినాడ టౌన్, కాచిగూడ - తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు బుధవారం (మే 24న) విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

Summer Special Trains: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లు
Summer Special Trains
Follow us

|

Updated on: May 24, 2023 | 6:12 PM

Railway Passenger Alert: సమ్మర్ సీజన్ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు లబ్ధి చేకూరేలా పలు ప్రత్యేక రైళ్లను ఇది వరకే ప్రకటించింది. తాజాగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. కాచిగూడ – కాకినాడ టౌన్, కాచిగూడ – తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు బుధవారం (మే 24న) విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. కాచిగూడ నుంచి తిరుపతికి (రైలు నెం.07061) మే 25 నుంచి ప్రతి గురువారం ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి గురువారంనాడు రాత్రి 10.10 గం.లకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు(శుక్రవారం) ఉదయం 10.30 గం.లకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే తిరుపతి నుంచి కాచిగూడకి (రైలు నెం.07062) మే 26వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 03.00 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 04.00 గం.లకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ షాద్ నగర్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రాజంపేట్, రేణిగుండ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

అలాగే కాచిగూడ నుంచి కాకినాడ టౌన్‌కి (రైలు నెం.07417) ప్రత్యేక వీక్లీ రైలును ఈ నెల 27 తేదీ నుంచి ప్రతి శనివారం నడపనున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైలు ప్రతి శనివారం రాత్రి 08.45 గం.లకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.45 గం.లకు కాకినాడ టౌన్‌కి చేరుకుంటుంది. అలాగే కాకినాడ టౌన్ నుంచి కాచిగూడకు (రైలు నెం.07418) ప్రత్యేక వీక్లీ రైలును ఈ నెల 28 తేదీ నుంచి ప్రతి ఆదివారం ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం రాత్రి 09.55 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.45 గం.లకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ కాజిపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

ఇవి కూడా చదవండి

ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని ద.మ.రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి.

ఇదిలా ఉండగా పలు వీక్లీ ప్రత్యేక రైళ్లను జులై నెలాఖరు వరకు పొడగిస్తున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Special Trains

SCR Extends Weekly Special Train Services during Summer Season

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు