AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Parliament: కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 19 విపక్ష పార్టీల నిర్ణయం.. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటీ..?

కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవంపై రగడ కొనసాగుతోంది. ఈనెల 28వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించబోతున్నారు. అయితే ప్రధాని కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పార్లమెంట్‌ను ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

New Parliament: కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 19 విపక్ష పార్టీల నిర్ణయం.. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటీ..?
New Parliament Building
Shaik Madar Saheb
|

Updated on: May 24, 2023 | 1:59 PM

Share

కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవంపై రగడ కొనసాగుతోంది. ఈనెల 28వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించబోతున్నారు. అయితే ప్రధాని కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పార్లమెంట్‌ను ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రధాని కేవలం ప్రభుత్వానికి మాత్రమే నేతృతం వహిస్తారని, రాష్ట్రపతి మాత్ర శాసన వ్యవస్థకు నేతృత్వం వహిస్తారని అంటున్నాయి విపక్షాలు. అందుకే రాష్ట్రపతి చేతుల మీదుగా కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 19 విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. వాటిలో కాంగ్రెస్‌, లెఫ్ట్, జేడీయూ, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన(ఉద్దవ్‌ వర్గం) ఉన్నాయి.

అయితే, కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుపై బీఆర్ఎస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కేసీఆర్ తో టచ్‌లో ఉన్న మిత్రపక్షాలన్నీ ఇప్పటికే బహిష్కరిస్తున్నట్లుగా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇంకో నాలుగు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఆలోచించి నిర్ణయం తీసుకుందామని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీగా అవతరిస్తున్న BRS.. పార్లమెంట్ ప్రారంభోత్సవంపై తీసుకునే నిర్ణయం ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే.. వేచిచూడాల్సిందే..

పార్లమెంట్ భవనాన్ని ప్రధాని కాకుండా.. ముర్ము ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్న విపక్షాల ఆరోపణలను బీజేపీ తిప్పికొడుతోంది. పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించామని చెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయమని , విపక్షాలు తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని అమిత్‌షా కోరారు. కొత్త పార్లమెంట్‌ వారసత్వ సంపద అని అన్నారు. కొత్త పార్లమెంట్‌ భవనాన్ని కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. స్పీకర్‌ కుర్చీ వెనుక ఈసారి రాజదండాన్ని పెట్టబోతున్నారు. బ్రిటీష్‌ వారు దేశ తొలి ప్రధాని నెహ్రూకు అధికారాన్ని అప్పగిస్తూ ఇచ్చిర రాజదండాన్ని కొత్త పార్లమెంట్‌లో ప్రదర్శిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..