Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ రెండు నగరాల మధ్య తిరిగే వీక్లీ స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు..
Extension Of weekly Special Trains: ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన..
Extension Of weekly Special Trains: ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖ పట్నం- సికింద్రాబాద్ (Visakhapatnam– Secunderabad) మధ్య వీక్లీ స్పైషల్ ట్రైన్‌లు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉగాదితో పాటు వేసవి రద్దీని దృష్టిలో పెంచుకుని మరికొన్ని రోజుల పాటు పొడిగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తివివరాలిలా ఉన్నా్యి. ప్రతి బుధవారం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు బయలు దేరే 08579 వీక్లీ స్పెషల్ ట్రైన్‌ను మే 25 వరకు పొడిగించింది. అదేవిధంగా ప్రతి గురువారం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే 08580 ట్రైన్ సర్వీసును మే 26 వరకు కొనసాగించనున్నారు.
ఇక ప్రతి మంగళవారం విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ బయలుదేరే 08585 స్పెషల్ ట్రైన్‌ను మే 31 వరకు పొడిగించారు. వీటితో పాటు ప్రతి బుధవారం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే 08586 వీక్లీ స్పెషల్ ట్రైన్ సర్వీసును జూన్ 1 వరకు పొడిగించినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ రైల్వే సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
Also Read:Hyderabad: ఎంజీఎంలో ఎలుకలు కొరుక్కుతిన్న ఘటనలో విషాదం..చికిత్స పొందుతూ బాధితుడు శ్రీనివాస్ మృతి..
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఇబ్బందులు తీర్చేందుకు సరికొత్త ఫీచర్