TSRTC: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా.? ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన.
సంక్రాంతికి ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి సొంతూళ్‌లకు వెళ్లే వారికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక విషయాన్ని వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. సజ్జనార్ ట్వీట్ చేస్తూ.. 'ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి భువనగిరి-యాదగిరిగుట్ట, మోత్కూర్/తొర్రూర్ వైపునకు వెళ్లే బస్సుల ఆపే స్థలాలను తెలంగాణ ఆర్టీసీ మార్చడం జరిగింది...
సంక్రాంతి పండుగకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నుంచి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. దీంతో ప్రజలు సొంతూళ్లకు పయణమవుతున్నారు. గురువారం నుంచే హైదరాబాద్ నుంచి పల్లెలలకు వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నగరంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ పెరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు కీలక ప్రకటన చేశారు.
సంక్రాంతికి ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి సొంతూళ్‌లకు వెళ్లే వారికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక విషయాన్ని వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. సజ్జనార్ ట్వీట్ చేస్తూ.. ‘ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి భువనగిరి-యాదగిరిగుట్ట, మోత్కూర్/తొర్రూర్ వైపునకు వెళ్లే బస్సుల ఆపే స్థలాలను తెలంగాణ ఆర్టీసీ మార్చడం జరిగింది. హన్మకొండ వైపునకు వెళ్లే బస్సులు యథావిధి స్థానంలో ఆగుతుండగా.. యాదగిరిగుట్ట, తొర్రూర్ బస్టాప్‌లను లిటిల్ ప్లవర్ స్కూల్ సమీపంలోకి సంస్థ మార్చింద’ని ట్వీట్ చేశారు.
సంక్రాంతికి ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి సొంతూళ్‌లకు వెళ్లే వారికి ముఖ్య గమనిక! ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి భువనగిరి-యాదగిరిగుట్ట, మోత్కూర్/తొర్రూర్ వైపునకు వెళ్లే బస్సుల ఆపే స్థలాలను #TSRTC మార్చడం జరిగింది. హన్మకొండ వైపునకు వెళ్లే బస్సులు యథావిధి స్థానంలో ఆగుతుండగా..… pic.twitter.com/UK7X3cnR2r
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) January 11, 2024
అలాగే ఒక్కో బస్టాప్‌ను 300 మీటర్లతో గ్యాప్‌తో ఏర్పాటు చేశామని తెలిపిన సజ్జనార్, మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కావున, ఈ సంక్రాంతికి రెగ్యులర్, స్పెషల్ బస్సులన్నీ ఉప్పల్ క్రాస్ రోడ్డు సమీపంలోని ఈ బస్టాప్‌ల నుంచే బయలుదేరుతాయని తెలిపారు. ప్రయాణికులందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.
సీసీటీవీ కెమెరాల ఏర్పాటు..
ఇదిలా ఉంటే సొంతూళ్లకు వెళ్లే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే.. హైదరాబాద్‌లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సుదుపాయం కల్పించారు. ప్రధాన ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లైన ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్‌లలో కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు.
రద్దీ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు!
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి అసౌకర్యం కలగకుండా #TSRTC పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల… pic.twitter.com/t7RGOgN0Ob
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) January 11, 2024
ఈ సీసీటీవీ కెమెరాలన్నింటినీ.. బస్ భవన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఈ సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని ట్వీట్ చేశారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..