వనస్థలిపురంలో ఏటీఎం వ్యాన్ నుంచి. రూ.70 లక్షలు లూటీ!
హైదరాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం వనస్థలిపురంలో ఏటీఎం మిషన్లలో డబ్బులు పెట్టే వ్యాన్ నుంచి భారీ దోపిడీ జరిగింది. రూ.70లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. మీ వాహనం కింద డబ్బులు పడిపోయాయంటూ ఏజన్సీ సిబ్బంది దృష్టిని మళ్లించి ఈ ఘరానా చోరీ చేసారు. యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు నింపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఏజెన్సీ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలం చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్‌లను […]
హైదరాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం వనస్థలిపురంలో ఏటీఎం మిషన్లలో డబ్బులు పెట్టే వ్యాన్ నుంచి భారీ దోపిడీ జరిగింది. రూ.70లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. మీ వాహనం కింద డబ్బులు పడిపోయాయంటూ ఏజన్సీ సిబ్బంది దృష్టిని మళ్లించి ఈ ఘరానా చోరీ చేసారు. యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు నింపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏజెన్సీ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలం చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఈ చోరీ దొపిడీ దొంగల పనిగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన ఏజెన్సీ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ శివారులో ఉన్న చెక్‌పోస్టులను సైతం అప్రమత్తం చేశారు.