చలానాల ‘కింగ్’… ఆ కారు డ్రైవర్
హైదరాబాద్‌లో క్యాబ్ సర్వీస్ నడుపుతున్న ఉండేటి సింహేందర్ రావు అనే వ్యక్తి వెరైటీగా వార్తలకెక్కాడు. మంగళవారం గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ దగ్గర నో పార్కింగ్ జోన్‌లో కారును పార్క్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులు కారును గమనించి జరిమానా విధించారు. పనిలో పనిగా పోలీసులు పెండింగ్ చలానాలు ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసి షాక్ తిన్నారట. ఆ కారుపై ఏకంగా 104 చలానాలు.. మొత్తం కలిపి రూ.17,805 చెల్లించాలని తేలింది. దీంతో డ్రైవర్‌పై ఛార్జ్‌షీట్ ఫైల్ చేసి కారును సీజ్ […]
హైదరాబాద్‌లో క్యాబ్ సర్వీస్ నడుపుతున్న ఉండేటి సింహేందర్ రావు అనే వ్యక్తి వెరైటీగా వార్తలకెక్కాడు. మంగళవారం గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ దగ్గర నో పార్కింగ్ జోన్‌లో కారును పార్క్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులు కారును గమనించి జరిమానా విధించారు. పనిలో పనిగా పోలీసులు పెండింగ్ చలానాలు ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసి షాక్ తిన్నారట. ఆ కారుపై ఏకంగా 104 చలానాలు.. మొత్తం కలిపి రూ.17,805 చెల్లించాలని తేలింది. దీంతో డ్రైవర్‌పై ఛార్జ్‌షీట్ ఫైల్ చేసి కారును సీజ్ చేశారు. అతడ్ని కోర్టులో ప్రవేశపెడతామని ట్రాఫిక్ పోలీసులు స్పష్టంచేశారు.
అంతేకాదు ఈ 104 చలానాలను మించిపోతూ.. నగరంలోని అబిడ్స్‌లో చీర వెంకటేష్ అనే వ్యక్తి బైక్‌పై ఏకంగా 105 పెండింగ్ చలానాలు ఉన్నాయి. మే 4న అబిడ్స్ పోలీసులు జగదీష్ మార్కెట్ దగ్గర పట్టుకున్నారు. ఆ చలానాలన్నీ కలిపి ఏకంగా రూ.16,390 ఉందట.