ఐ వాంట్ రీజన్..ఎందుకు అడ్డుకున్నారు?- వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్ నిర్వహణకు నిన్న విజయవాడ వెళ్లిన వర్మను పోలీసులు బలవంతంగా హైదరాబాద్ తిరిగి పంపిన సంగతి తెలిసిందే. అంతకు ముందు హోటల్ యాజామాన్యాలు కూడా వర్మ చేసిన బుకింగ్స్‌ని క్యాన్సిల్ చేశాయి. దీనిపై ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన వర్మ.. ‘నన్ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పట్లేదు. జగన్ మీద దాడి జరిగితే పోలీసులు విమానాశ్రయంలోకి రాలేదు. నన్ను మాత్రం విమానాశ్రయంలోనే అరెస్ట్ […]
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్ నిర్వహణకు నిన్న విజయవాడ వెళ్లిన వర్మను పోలీసులు బలవంతంగా హైదరాబాద్ తిరిగి పంపిన సంగతి తెలిసిందే. అంతకు ముందు హోటల్ యాజామాన్యాలు కూడా వర్మ చేసిన బుకింగ్స్‌ని క్యాన్సిల్ చేశాయి. దీనిపై ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన వర్మ.. ‘నన్ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పట్లేదు. జగన్ మీద దాడి జరిగితే పోలీసులు విమానాశ్రయంలోకి రాలేదు. నన్ను మాత్రం విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటున్నామా అన్న సందేహం కలుగుతోంది. విజయవాడలో ఉండటానికి వీలు లేదని పోలీసులు బెదిరించారు. ఇదేమైనా వేరొక దేశమా. ఎందుకు మమ్మల్ని అనుమతించలేదు’ అని ప్రశ్నించారు. నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ‘ఇది ముమ్మాటికీ ఏపీ ప్రభుత్వం కుట్రలో భాగమే. మేము దేనికీ భయపడే ప్రసక్తే లేదు. మే 23 వ తేదీలో ప్రజలు కూడా వారికి తగిన గుణపాఠం చెప్పబోతున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.